Guppedantha Manasu : వాడికి వార్నింగ్.. రంగానే రిషి అని వసుధార కనిపెట్టేసిందా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1118 లో..... వసుధారని రంగా స్కూల్ కి తీసుకొని వస్తాడు. అక్కడ సర్ తో మాట్లాడి జాబ్ ఇప్పిస్తాడు. సర్ సర్టిఫికెట్ అడుగగా ఇప్పుడు లేవు మేడమ్ గారి తెలివి గురించి ఆలోచించనవసరం లేదు కావాలంటే.. ఇప్పుడు టెస్ట్ పెట్టండి అని రంగా అనగానే సరే ఆ ఫార్మ్లా లు రాయండి అని సర్ వసుధారకి చెప్తాడు. వసు ఫార్మ్లా తప్పుగా రాస్తుంది. దాంతో రంగా కోపంగా అది కూడా రాయడం రాదా అంటూ ఫార్మ్లాని సరి చేస్తాడు. ఆ తర్వాత మేడమ్ ఏదో అలా రాసిందని రంగా అనగానే.. సరే తర్వాత మాట్లాడుదామని సర్ అంటాడు.

మరొకవైపు మను ఇంటికి ఫణీంద్ర వచ్చి.. శైలేంద్రతో మాట్లాడింది గుర్తుకుచేసుకుంటాడు. శైలేంద్రని పిలిచి.. మను ఎందుకు మన ఇంటికి వచ్చాడని అడుగుతాడు. ఏదో క్యాజువల్ గా వచ్చాడని చెప్పడు కదా అని శైలేంద్ర అంటాడు. మీరు మాట్లాడుకున్న మాటలు చూస్తుంటే క్యాజువల్ గా వచ్చినట్టు లేదని ఫణీంద్ర అంటాడు. ఎండీ పదవి మీద ఇంత ఆశ ఏంటిరా.. ఒకవేళ దానికోసం ఏదైనా కుట్రలు చేస్తున్నావని తెలిస్తే మాత్రం అసలు ఊరుకోను.. నీ అదృష్టం బాగుండి నువ్వు అయితే ఒకే కానీ మను టాలెంట్ తో అయితే కూడా దాన్ని ఒప్పుకోవాలని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర వెళ్లిపోయాక.. అసలు ఈ మను గాడు లేకుంటే వేరే ఆప్షన్స్ ఉండకపోవు.. నేనే ఎండీ అయ్యే వాడిని.. ఇప్పుడు ఆప్షన్ లాగా మిగిలానని శైలేంద్ర అంటాడు. వాడిని ఎలా అడ్డుతొలగించాలో నాకు తెలుసు.. వసుధార రాసిన లెటర్ ని అనుపమకి చూపిస్తే వాడిని మన జోలికి రాకుండా అడ్డుపడుతుందని దేవయాని అంటుంది. అప్పుడే ధరణి వచ్చి.. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారని అంటుంది.

మరొకవైపు ఆ వసుధర నా బావని నాకు దూరం చేస్తుందేమోనని సరోజ టెన్షన్ పడుతుంది. రంగా ఫ్రెండ్ సరోజని ఇంకా రెచ్చగొడతాడు. ఆ వసుధర బావ వాళ్ళ దగ్గరికి వెళదామంటూ సరోజ వాళ్ళు స్కూల్ కి వెళ్తారు. అక్కడ వసుధార, రంగా మాట్లాడుకునేది వింటారు. మీరు నా రిషి సర్.. నేను కావాలనే ఫార్మ్లా తప్పుగా రాసాను.. అలా రాస్తే సర్ కి కోపం వస్తుంది. మీకు వచ్చింది మీరు ఫార్మ్లా రాసారని వసుధార అనగానే.. నేను ఎప్పుడో నేర్చుకున్నది రాసానని రంగా అంటాడు. ఆ తర్వాత వసుధార పడిపోబోతుంటే రంగా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.