Brahmamudi : ఇలాంటివాడిని జైల్లో ఉంచడం కాదు.. మనమే బుద్ది చెప్పాలి!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -453 లో... నా వంతు ప్రయత్నం చేశాను సర్.. కళ్యాణ్ గారు తన భార్యని టార్చర్ చేసారని సాక్ష్యం ఉంది.. మనం అవన్నీ అబద్ధాలని నిరూపించాలి లేదంటే కష్టమని లాయర్ అంటాడు. అదేంటి భార్యని భర్త ఎలా చూసుకున్నాడు అనేదానికి సాక్షాలు ఏముంటాయని ధాన్యలక్ష్మి అంటుంది. టార్చర్ చేసాడని సాక్ష్యం ఉన్నప్పుడు.. ఇవి కూడా చూపించాలి కదా అని లాయర్ అంటాడు. వాళ్ళు తీసుకొని రాలేరు.. ఎందుకంటే నా మొగుడు ఎప్పుడు నాతో అలా ప్రేమగా నడుచుకోలేదు కదా అని అనామిక అంటుంది.

ఆ తర్వాత ఇప్పటికైనా టైమ్ మించి పోలేదు.‌. మీ కొడుకు చేసిన తప్పులకి క్షమాపణ అడిగి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పండి.. కేసు వాపస్ తీసుకుంటానని అనామిక అనగానే.. నువ్వు ప్రేమించావ్ అంటే నమ్మాను మోసపోయాను కానీ మళ్ళీ ఇప్పుడు మోసపోలేనని కళ్యాణ్ అంటాడు. సరే రేపు కోర్టులో చూసుకుందాం.. మీ లాయర్ గారు సాక్షాలు కావాలంటున్నారు కదా తీసుకొని రండి అని అనామిక పొగరుగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను చెప్పినట్టు చేసావా అని రుద్రాణి రాహుల్ తో అనగానే.. అందులో మన మనుషులు సిద్ధంగా ఉన్నారని రాహుల్ అంటాడు. కళ్యాణ్ వెళ్తుంటే.. వీడికి జైల్లో శిక్ష కంటే మనమే బుద్ధి చెప్పాలని కళ్యాణ్ పై కొందరు మహిళలు టమాటాలు, కోడిగుడ్లు వేస్తుంటే రాజ్ , కావ్య ప్రకాష్ , ధాన్యలక్ష్మి లు వెళ్లి ఆపుతారు. తమ్ముడు తప్పు చేసాడంటే ఆ తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి.. తనని ఏం అనకండి నన్ను శిక్షించండి అని రాజ్ అనగానే.. వాళ్ళు టమాట కోడిగుడ్లు రాజ్ పైకి వేస్తారు. మీరు ఒక తప్పుడు మనిషిని నమ్మి ఇదంతా చేస్తున్నారని రాజ్ అంటాడు. అదంతా చూసిన అనామిక నవ్వుకుంటుంది.

మరొకవైపు అప్పు కోర్ట్ కి వెళ్ళాలని తెలియడంతో.. కనకం నేను పంపించనని అంటుంది. దంతో కృష్ణమూర్తి నచ్చజెప్పుతాడు. ఆ తర్వాత దుగ్గిరాల కుటుంబం మొత్తం అనామిక చేస్తున్న పని గురించి బాధపడతారు. ఏది ఏమైనా కళ్యాణ్ ని బయటకు తీసుకొని వస్తాను.. అంతేగానీ ఆ అనామిక ముందు తల దించుకొని తప్పు అయింది అనొద్దని అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కళ్యాణ్ ని బయటకు తీసుకోచ్చే సాక్ష్యం ఎక్కడున్నాయని ధాన్యలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో అనామిక దగ్గరికి కావ్య వెళ్తుంది. నువు మీ అప్పులు తీర్చడానికే ఇదంతా చేస్తున్నావా అని కావ్య అనగానే.. అవును నువ్వేం చేస్తావని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.