రెండు రోజులు ప్రమాణ స్వీకారం చేసిన ఒబామా
posted on Jan 21, 2013 11:00AM
వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన ఒబామా ఈ సారి ప్రమాణస్వీకారోత్సవాన్ని రెండు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటున్నారు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఒబామా జనవరి 20 వ తేదీన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రోజు సెలవు దినం కావడంతో ఒబామా ప్రమాణ స్వీకారోత్సవం రెండు రోజులు పాటు కొనసాగనుంది.
సంప్రదాయం ప్రకారం జనవరి 20 వ తేదీనే ప్రైవేట్ కార్యక్రమంలో ప్రమాణస్వీకారోత్సవం పూర్తీ అవుతోంది. అధికారిక లాంఛనాలతో సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఇలా అమెరికా చరిత్రలో రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుకుంటున్న మూడో అధ్యక్షుడు బారక్ ఒబామా. ఇది వరకూ అమెరికా ప్రఖ్యాత అధ్యక్షుడు ఐసన్ హోవర్ ఆ తర్వాత రొనాల్డ్ రీగన్ లు మాత్రమే ఇలా రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుకున్నారు.