బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో మంటలకి 245మంది బలి
posted on Jan 28, 2013 11:37AM
బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు. ఈ సమయంలో క్లబ్‌లో 500 మంది దాకా ఉన్నారు.
ఇప్పటిదాకా 180 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దట్టమైన మంటలు, పొగలతో కమురుకుపోయిన క్లబ్ భవంతి నుంచి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తీవ్ర తొక్కిసలాట చేసుకుందని, తద్వారా మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదవిషయం తెలిసిన వెంటనే.. అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ చిలీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. కాగా, మరో ఏడాదిలో బ్రెబిల్‌లో అంతర్జాతీయ సాకర్ పోటీలు జరగాల్సి ఉంది. తాజా దుర్ఘట న ప్రభావం ఆ పోటీల నిర్వహణపై పడొచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు.