తెలంగాణా ఉద్యమనాయకులను తప్పు పట్టిన ఉండవల్లి
posted on Jan 25, 2013 7:56PM
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రీలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ మహాసభలో మాట్లాడుతూ కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులను ఉద్యమం పేరిట ప్రజలమధ్య విద్వేషాలు రగిలిస్తున్నందుకు తప్పుపట్టారు. వారు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే తెలంగాణా ఉద్యమాలు మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలను,రాజకీయ నాయకులను నరుకుతాము, తరిమికొడతామంటూ భయబ్రాంతులకు గురిచేసి ఉద్యామాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.
సముద్రంలో వృధాగా కలిసిపోతున్ననీటిని పంటలకు ఉపయోగపడేవిదంగా తెలంగాణా దిగువనున్నపోలవరం వద్ద ప్రాజెక్టు కడితే, ఎగువనున్న తెలంగాణాకు ఏ విదంగా నష్టం వాటిల్లుతుందో తెలుపమని సవాలు విసిరారు. పోలవరం వల్ల నష్టపోయే గిరిజనుల గురించి కేసిర్ కి ఎంత తాపత్రయం ఉందో తమకీ అంతే ఉందని, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి వారి జీవితాలు చక్క దిద్దేందుకు కలిసి కృషిచేద్దామని అయన అన్నారు. ఉండవల్లి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి వివరాలను గణాంకాలతో సహా సభికులకి వివరించారు.
శాసనసభలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నంతకాలం గుర్తుకురాని తెలంగాణా, తరువాత ఎందుకు గుర్తుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీర్ చేపట్టిన ఉద్యామలవల్లనే అమయకులయిన విద్యార్దులు చనిపోతుంటే అందుకు తమని నిందించడం ఏమీ న్యాయమని ఆయన ప్రశ్నించారు. చనిపోయినవారు ఎవరి పిల్లలయినా అందరికీ బాధ కలుగుతుంది, అందుకు బాష, ప్రాంతం అడ్డురావని ఆయన అన్నారు.
కేసీర్, ప్రొఫెసర్ కోదండరాం వివిధ సభలలో ఆంద్ర ప్రాంతవాసులను, మంత్రులను అవహేళను చేస్తూ, బెదిరిస్తూ మాట్లాడిన విడియో క్లిప్పింగులను సభికులకు ప్రదర్శించి చూపిన ఉండవల్లి, ఆంద్ర ప్రజలను ఈ విదంగా అవమానించడం ఏమి సబబు అని ప్రశ్నించారు. తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసమే మొదలు పెట్టిన తెలంగాణా ఉద్యమంలో అమాయకులు, సామాన్యులు సమిదలయి రాలిపోతుంటే ఆయన మాత్రం తన ఉద్యమం కొనసాగించడం దారుణం అని అన్నారు. అయన చెప్పటిన ఉద్యమంలో అయన బంధువులుగానీ, పార్టీకి చెందిన నేతలకి గానీ ఒంటి మీద ఈగ కూడా వాలకపోయినా, అమాయకులయిన విద్యార్దులు మాత్రం అసువులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
రాష్ట్ర ప్రజలు కలిసి అభివృద్ధి సాదించాలే తప్ప విడిపోయి బావుకోనేది ఏమి ఉండబోదని ఆయన అన్నారు. రాహుల్ గాందీ మొన్న చింతన శిబిర్ లో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఇంట కాలానికి దేశాన్ని సవ్య దిశలో తీసుకుపోగల నాయకుడు దొరికాడని మెచ్చుకొన్నారు.