టీడీపీకి బొడ్డు భాస్కర్ రాం రాం చెప్పేస్తాడా?
posted on Jan 20, 2013 9:10PM
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నపుడు నిన్న మొన్నటివరకు నోరుమెదపని పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుడు బొడ్డు బాస్కరరామారావుకి అకస్మాత్తుగా సమైక్యాంద్రా గుర్తుకువచ్చి, పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. అయన తన అస్త్రాలను నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీదకే ఎక్కుపెట్టి తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకోనందుకు సిగ్గుపడాలి అని విమర్శించారు. పార్టీ నిర్ణయాన్ని హోం మంత్రికి లేఖ రూపంలో అందజేసిన యనమల రామకృష్ణుడుని బిళ్ళ బంత్రోటుతో సరిపోల్చుతూ అతని మీద కూడా తీవ్రమయిన విమర్శలు గుప్పించారు. ఆఖరి మాటగా, సమైక్యాంద్రాని వ్యతిరేఖిస్తున్న తెలుగుదేశం పార్టీ పంచనపడి ఉండటం కంటే ఆ పార్టీని వదిలేయడమే మేలని పలికి తన భవిష్యత్ ప్రణాలికను చూచాయగా తెలియజేసారు.
భాస్కర రామారావు గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ వెనక తిరుగుతున్నట్లు సమాచారం. ఇక శాస్త్రప్రకారం తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకోవడం అయిపొయింది, గనుక ఇక నేడో రేపో పార్టీని వదిలి జగన్ పార్టీలో జేరిపోవడం ఖాయం.