త్వరలో మళ్ళీ మరో ప్రస్తానం

 

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మోకాలి శస్త్రచికిత్సకోసం మద్యలో నిలిపివేసిన తన పాదయాత్రను మళ్ళీ వచ్చేనెల మొదటివారం నుండి ప్రారంబించవచ్చునని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఈ రోజు మీడియాకి తెలియజేసారు. వైద్యులు ఊహించినదానికంటే త్వరగానే ఆమె కోలుకోన్నారని, అందువల్ల ఆమె తన పాదయత్రని త్వరలో ప్రారంబించదానికి వైద్యులు కూడా అనుమతినీయడంతో, ప్రస్తుతం ఫిజియో థెరపీ తీసుకొంటూ నడక ప్రాక్టీసు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె తెలంగాణాలో పాదయాత్ర చేస్తారా లేక వేరే చోట నుండి మొదలు పెడతారా అనేది ఇంకా తెలియలేదు.

 

జనవరి 28వ తేదిన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన వచ్చే అవకాశాలు సన్నగిల్లినందున ఆగ్రహావేశాలతో ఉండే తెలంగాణావాదులు, అఖిలపక్షంలో తెలంగాణాకి వ్యతిరేఖంగా లేఖ ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల పాదయాత్రను సజావుగా సాగనియకపోవచ్చును. మరి అటువంటప్పుడు ఆమె అక్కడి నుండి పాదయాత్ర ప్రారంబిస్తారా లేక వేరే ప్రాంతాన్ని ఎంచుకొంటారా అనే విషయం తెలుసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాలి.

 

అయితే, ఇటువంటి క్లిష్ట సమయంలోనే ఆమెను మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టించడంలో కారణం ఏమిటని ఆలోచిస్తే, తమ పార్టీపై తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస పార్టీలు జరుపుతున్న దుష్ప్రచారం అడ్డుకోవడం ఒక కారణం అయితే, అటు, తెలంగాణాలోనూ ఇటు ఆంధ్ర ప్రాంతంలోనూ అప్రతీహతంగా సాగిపోతున్న చంద్రబాబు పాదయాత్ర వల్ల తమ పార్టీకి హాని జరగకుండా కాపాడుకోవడానికి అయిఉండవచ్చును. ఆమె పాదయాత్ర తెలంగాణాలో కాకుండా మరెక్కడి నుండి మొదలుపెట్టినా అవే కారణాలుగా భావించవచ్చును.

 

గానీ, ఆమె తెలంగాణాలోనే తిరిగి పాదయత్ర మొదలు పెడితే మాత్రం దాని వెనుక మరిన్ని బలమయిన కారణాలు చాలానే ఉండవచ్చును. ఆగ్రాహవేశాలతో ఉన్న తెలంగాణా నేతలకు ఆమె పాదయాత్ర ఒక సవాలు వంటిదని చెప్పవచ్చును. వారిని అటువంటి తరుణంలో డ్డీ కొనడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి క్లిష్ట సవాళ్లనయినా ఎదుర్కోవడానికి సిద్దం అని సంకేతం ఇచ్చినట్లు అవుతుంది.