కృష్ణా జిల్లాలో పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు
posted on Jan 26, 2013 7:32PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజులు పాదయాత్ర పూర్తీ చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో స్థానిక పార్టీ నేతలు నిర్మించిన 117 అడుగుల ఎత్తున్న పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా జిల్లాలో పైలాన్ అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం, వయసు ఇతర శారీరిక సమస్యలను దృష్టిలోఉంచుకొని, ముందు నిర్ణయించినట్లుగానే జనవరి 26వ తేదీతో పాదయాత్ర ముగింపు పలుకుతారని అందరూ ఊహించినపటికీ అయన తన పాద యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు అయన వ్యక్తిగత వైద్యులు కూడా పాదయాత్రకు ముగింపు ముగింపు పలికి ఇక విశ్రాంతి తీసుకోమని కోరినపటికీ, ప్రజల పడుతున్న కష్టాలతో పోలిస్తే తన సమస్యలు చాల చిన్నవని, అందువల్ల తన పాదయాత్ర కొనసాగించదలుచుకొన్నానని ఆయన స్పష్టం చేశారు. తన శరీరం ఆరోగ్యం సహకరించినంత కాలం ముందుకు సాగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.