స్వామి కమలానంద భారతికి బెయిల్
posted on Jan 19, 2013 1:50PM
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి కమలానంద భారతికి బెయిల్ దొరికింది. నాంపల్లి కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఐదు వేల రూపాయలేసి రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు కమలానంద భారతిని ఆదేశించింది.
కేసు విచారణ సమయంలో సిట్ పోలీసులకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు కమలానందకు షరతు విధించింది.
కమలానంద భారతిని పోలీసులు ఈ నెల 14వ తేదీన శ్రీశైలంలో అరెస్టు చేశారు. కమలానంద భారతిని ఒక రోజు పాటు తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఆ గొంతు తనదేనని అంగీకరిస్తూ తాను వ్యక్తిగత దూషణలకు దిగలేదని, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని కమలానంద భారతి పోలీసులకు చెప్పారు.