జైపూర్ సదస్సు ఎజెండాలో తెలంగాణ లేదు: వాయలార్ రవి

 

 

 Congress' two-day Chintan Shivir begins in Jaipur today,Congress' two-day Chintan Shivir begins in Jaipur today

 

 

జైపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ చింతన్ శిబిర్‌ లో ముఖ్యమైన అంశంగా తెలంగాణ పై చర్చిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. మొదటి రోజు జరిగిన మేధోమధన సదస్సు లో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని కేంద్ర మంత్రి వాయలర్ రవి వ్యాఖ్యానించారు. జైపూర్‌ సదస్సు లో రాజకీయ పొత్తులపై చర్చజరుగుతుందని, చిన్న రాష్ట్రాలపై కూడా చర్చ లేదని వాయలార్ చెప్పడం ద్వారా తెలంగాణ అంశం ప్రస్తావనకు వస్తుందా? రాదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మేధోమధన సదస్సు లో తెలంగాణపై రెండో రోజు చర్చ జరగవచ్చునని కాంగ్రెస్ వర్గాల సమాచారం.