ఘాటు ముద్దులు, పైకి ఎత్తడాలు.. వామ్మో ఏంది ఈ రచ్చ..!

బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి 'కిర్రాక్ బాయ్స్ అండ్  ఖిలాడీ గర్ల్స్' పేరుతో ఈ నెల 29 నుంచి స్టార్ మా ఛానల్ లో ఓ షో ప్రసారం కాబోతోంది. ఇప్పుడు ఈ  గేమ్ షోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఎండింగ్ చూస్తే ఎం రా ఈ షో వల్ల లాభమూ అని  అనుకోకుండా ఉండరు. ఆడియన్స్ అంతా సిగ్గుపడేలా అనసూయ టాప్ తీసేయగా.. శేఖర్ మాష్టర్ కూడా షర్ట్ తీసేసి రా చూసుకుందాం అన్న రేంజ్ లో ధమ్కీ ఇచ్చేసరికి బాబోయ్ అనిపించింది అందరికీ. ఈ షో పేరుకి తగ్గట్టే మంచి బలవంతులైన ఖిలాడీ భామలంతా వచ్చారు. అయితే ఖతర్నాక్ కిలాడి లేడీస్ కి అనసూయ లీడర్ గా ఉంటే కిర్రాక్ పుట్టించే బాయ్స్ కి శేఖర్ మాష్టర్ లీడర్ గా ఉన్నాడు. ఇక ఈ గేమ్‌లో గెలిచిన టీంకి రూ.20 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించింది అందాల యాంకర్ శ్రీముఖి. 

శ్రీముఖి ఉంటేనే షో సెగలు, పొగలు, వగలు, బిగులు అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ అనసూయ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, ఆయేషా, విష్ణు ప్రియా ద్యావుడా ఇంతమంది హాట్ గర్ల్స్ వచ్చేసరికి అది బ్రాండ్ న్యూ గేమ్ షో కాకుండా ఇంకేమవుతుంది. ఇక శేఖర్ మాస్టర్ ఎంట్రీలో ఒక డైలాగ్ వేసాడు "అనసూయ మేము మీతో పోటీకొచ్చినా మీకే రిస్కు..మీరు మాతో పోటీకొచ్చినా మీకే రిస్కు" అనేసరికి అనసూయ ఊరుకుంటుందా "ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకు అమ్మాయిలను ఓడించే మగాడు పుట్టలేదు మాష్టర్" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో ధమ్కీ ఇచ్చింది. ఇక ఆయేషాకి టాస్క్ ఇచ్చారు.. వెల్లుల్లిపాయలు, పచ్చిమర్చి ప్లేట్ లో పెట్టడంతో ఆమె వెల్లుల్లి రెబ్బలు తిని వెళ్లి శేఖర్ మాష్టర్ స్పైసి కిస్ ఇచ్చేసింది. ఇక పల్లవి గౌడ ఇచ్చిన షాక్ కి సెట్ లో మొత్తం సైలెంట్ ఇపోయారు. "కెన్ ఐ లిఫ్ట్ యు" అంటూ పల్లవి గౌడా శేఖర్ మాష్టర్ ని రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పేసింది. శేఖర్ మాష్టర్ మాత్రం అలా అమ్మాయి చేతిలో గిరగిరా తిరుగుతూ సిగ్గు పడిపోయాడు.