పాటకు అర్ధం తెలిస్తే పిచ్చోళ్ళలా గంతులేయరు!

1991 లో రిలీజ్ అయిన "గుణ" మూవీ చూడని వాళ్ళు కానీ "కమ్మని ఈ ప్రేమ లేఖనే" అనే పాటను వినని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన "మంజుమల్ బాయ్స్" సినిమా మొత్తం కూడా ఈ గుణ కేవ్స్ లో తీయడంతో పాటు ఈ పాటను కూడా పెట్టారు. ఈ పాట నేపథ్యంలో కమలహాసన్ తన ప్రేమను పాట రూపంలో కాకుండా మాట రూపంలో చెప్తాడు.. అది కాస్త హీరోయిన్ పాటగా మార్చి పాడుతుంది. మానసికంగా దెబ్బ తిన్న హీరోగా కమల్ హాసన్ బాగా నటించాడు. అలాగే హీరోయిన్ ని విలన్స్ ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు వీళ్ళిద్దరూ బయటపడి ఈ గుణ కేవ్స్ కి వస్తారు. మొదట్లో హీరోని ద్వేషించే అమ్మాయి కాస్తా అతని మనసు మంచిదని తెలుసుకుని అతన్ని ఇష్టపడి మామూలు మనిషిని చేసి పెళ్లి చేసుకుంటుంది. ఐతే ఈ సాంగ్ వీళ్ళ మధ్య ప్రేమను పుట్టిస్తుంది, బాధను మరిపిస్తుంది...అలాగే వాళ్ళ జీవితాల్లో జరిగిన నిజాలని గుర్తించేలా చేస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకునే సాంత్వన గీతం..కానీ ఈ పాటను రీమిక్స్ చేసి చాలా మంది రకరకాల డాన్స్ స్టైల్స్ తో రీల్స్ చేసి ట్రెండ్ అవడం  మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. 

ఇప్పుడు ఆట సందీప్, జ్యోతి జోడి కూడా అలాగే ఈ రీమిక్స్ సాంగ్ కి కొత్త డాన్స్ స్టైల్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేశారు. అది చూసిన ఒక నెటిజన్ ఘాటుగా కామెంట్ పెట్టారు. "సాంగ్ మీనింగ్ తెలిస్తే ఇలా పిచ్చోళ్ళలా గంతులు వేయరు...రైట్ క్రేజ్ బట్ రాంగ్ సాంగ్" అంటూ ఒపీనియన్ ని ఇక్కడ పోస్ట్ చేసాడు. ఎందుకంటే ఒకప్పటి క్లాసిక్స్ కి లేదా కొన్ని ఓల్డ్ సాంగ్స్ ని ఇప్పటి జెనెరేషన్ అస్సలు టచ్ చేయకుండా ఉండడమే బెటర్ ..ఎందుకంటే ఆ పాటలు, ఆ సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది అప్పటి వాళ్లలో అలాగే ఉండిపోయింది. వాటిని రిక్రియేట్ చేస్తే దాని సెన్స్ మొత్తం పాడైపోయి..ఎందుకు పనికి రాని సాంగ్స్ గా, మూవీస్ గా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది.