శేఖర్ మాస్టర్ తో పోటీకి విప్పేస్తున్న అనసూయ.. ఇది గేమ్ షోనా లేక ఆ షోనా!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కే కాదు గేమ్ షోలకి క్రేజ్ ఎక్కువ. అటు బిగ్ బాస్, ఇటు స్టార్ మా పరివార్.. నీతోనే డ్యాన్స్ షో.. ఇలా రెగ్యులర్ గా ఏదో ఇక షోతో ఈ ఛానెల్ బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు సరికొత్త గేమ్ షోని తీసుకొచ్చారు మేకర్స్. అదే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ (Kiraak Boys Khiladi Girls).  

జూన్ 29 నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. ఈ షో పేరుకి తగ్గట్టే ఖిలాడీ భామల్ని రంగంలోకి దించారు మేకర్స్.  అనసూయ భరద్వాజ్ ఈ ఖిలాడీ భామలకు లీడర్ కాగా.. కిర్రాక్ బాయ్స్‌ టీమ్ కి శేఖర్ మాస్టర్ లీడర్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీమ్ కి రూ.20 లక్షల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు.

ఈ అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ చేయగా.. దానికి ధీటుగా శేఖర్ మాస్టర్ రెచ్చిపోయాడు. ఇక రెండు టీమ్స్‌లోనూ ఆ బిగ్ బాస్ అగ్రిమెంట్‌‌లో ఉన్న వాళ్లే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌ ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభాశెట్టి, టేస్టీ తేజ, అంబటి అర్జున్ లని ఈ షోకి తీసుకుని వచ్చారు.

ఈ గేమ్ షో మధ్యలో మధ్యలో ముద్దులు.. రొమాన్స్‌ కూడా ఉంది. గేమ్ షోలను మించిన షోనే అనేట్టుగా ఉంది. అయితే ఆఖర్లో ఏం టాస్క్ ఇచ్చారో ఏమో కానీ.. అటు శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పుతుంటే.. ఇటు అనసూయ తన టాప్‌ని విప్పుతూ సై సై అంటోంది. వీళ్లిద్దరూ పోటీపడి విప్పుతుంటే‌.. పక్కనుంచి శ్రీముఖి అరుపులు.. కంటెస్టెంట్స్ గోలలు.. వామ్మో ఇది గేమ్ షోలలో నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంది. మరి మీరు ఈ ప్రోమో చూసారా.‌ చూస్తే మీకనిపించిందో కామెంట్ చేయండి.