ఈ ఐదు పండ్ల రసాలు షుగర్ ఉన్నవారికి పంచదార కంటే డేంజర్..!
డయాబెటిస్‌ను నియంత్రించడానికి చక్కెరను పూర్తిగా తగ్గించాలి. పండ్లలో సహజ చక్కెర కూడా ఉంటుంది, ఇది మధుమేహం రావడానికి చాలా కారణం అవుతుంది. కొన్ని పండ్లలో ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తక్కువ సమయంలో బ్లడ్ షుగర్ ను రాకెట్ వేగంలో పెంచగలవు. నిజానికి డయాబెటిక్ డైట్‌లో సమతుల పరిమాణంలో పండ్లు తినడం ఆరోగ్యకం. కానీ పండ్ల రసంలో ఫైబర్, ఇతర విటమిన్ల పరిమాణం తగ్గిపోతుంది ఎక్కువగా చక్కెర మిగిలి ఉంటుంది. అందువల్ల వీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్ల రసాన్ని అస్సలు తాగకూడదు. అవేంటో తెలుసుకుంటే.. ఆపిల్ పండు రసం యాపిల్ ఒక సూపర్ హెల్తీ ఫ్రూట్ అయితే దాని రసం చక్కెరలో కూడా అంతే ప్రమాదకరం. ఈ పండులో సహజ చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేసే పిండి పదార్థాలను కూడా అందిస్తుంది. అందుకే యాపిల్ రసాన్ని తీసుకోవడం ప్రమాదం. మామిడికాయ రసం మామిడి పండ్లలో రారాజు అయితే రక్తంలో చక్కెర శాతం పెంచడంలో మామిడిపండ్ల రసం శత్రువులా పనిచేస్తుంది. దీన్ని తాగిన తర్వాత మధుమేహ రోగులు అధిక దాహం, నోరు పొడిబారడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నారింజ రసం నారింజ అధిక విటమిన్ సి కలిగిన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తింటే అనారోగ్య సమస్యల నుండి సులువుగా బయటపడతారు. కానీ డయాబెటిక్ పేషెంట్లు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. పైనాపిల్ రసం ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకుంటే అందులోని పిండి పదార్థాలు దాదాపు 16 గ్రాములుగా ఉంటాయి. ఇవి రక్తంలో వేగంగా కరిగి గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇది హైపర్గ్లైసీమియాకు దారి తీస్తుంది, రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వస్తుంది. పుచ్చకాయ రసం పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి ఎనర్జీని మెయింటెయిన్ చేస్తుంది. కానీ మధుమేహం, ప్రీ-డయాబెటిస్‌లో దీనిని తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నది భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినవచ్చు. *నిశ్శబ్ద.
read moreప్రోటీన్ పౌడర్లు కాదు.. ఈ డ్రింక్ 15రోజులు తాగితే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది!
ఎప్పుడూ అలసటగా, బలహీనంగా ఉంటుందా? బద్దకంగానూ, మోకాళ్లలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వీటిని అధిగమించడానికి జిమ్ కు వెళ్తున్నా, మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రొటీన్ పౌడర్‌లు తీసుకుంటున్నా అంత ఫిట్ గా అనిపించడం లేదా? ఈ సమస్యలను గనుక ఎదుర్కొంటున్నట్లయితే, ప్రోటీన్ తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నిత్యం బలహీనంగా ఉంటే శరీరంలో ప్రాణం ఉండదని, మోకాళ్లలో నొప్పులు వస్తుంటే మంచి ప్రోటీన్ అవసరం అని అర్థం. ఇంట్లోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రోటీన్ పౌడర్ కు కావలసిన వస్తువులు.. 60 గ్రాముల వేయించిన శనగలు 2 ఖర్జూరాలు. 1 అపటిపండు 1 గ్లాసు పాలు బెల్లం రుచికి సరిపడా తయారువిధానం.. ముందుగా వేయించిన శనగలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని సత్తు అని అంటారు. ఇది బీహార్ లో ఫేమస్. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిలో అరటిపండు, ఖర్జూరం, బెల్లం, పాలు వేసి కలపాలి. అంతే ఎంతో పోషకరమైన ప్రోటీన్ డ్రింక్ సిద్దమైనట్టే. ప్రయోజనాలు.. ఈ మిశ్రమాన్ని కేవలం 15 రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. బలహీనతతో బాధపడుతున్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లే కాకుండా శరీర సామర్థ్యం పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలు దీంట్లో లభిస్తాయి. ఈ శక్తివంతమైన ప్రోటీన్ డ్రింక్ లో కాల్షియం వల్ల కేవలం 15 రోజుల్లోనే శరీరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కు వెళ్లే అలవాటున్నా,వర్కౌట్లు చేస్తున్నా ఈ డ్రింక్ కు తీసుకుంటూ ఉంటే శరీరం దృడంగా మారుతుంది. ఎముకలు, కండరాలలో బలం పుంజుకుంటుంది. శరీరం ఉక్కులా మారుతుంది. *నిశ్శబ్ద.
read moreకడుపులో వికారం నుండి..కండరాల తిమ్మిరి వరకు.. ఇవన్నీ మెగ్నీషియం లోపమేనట..!
మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శారీరంలో వివిధ పనులు చేయడంలో కీలకమైనది. చాలావరకు ఇది గుర్తించబడదు. ఆరోగ్యం బాగుండాలంటే మెగ్నీషియం లోపం లక్షణాలు గుర్తించడం చాలా అవసరం. కడుపులో వికారం, కండరాల తిమ్మిరి నుండి చాలా లక్షణాలు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తాయి. అసలు మెగ్నీషియం లోపం గురించి, ఈ లోపముంటే కనిపించే ఇతర లక్షణాల గురించి తెలుసుకుంటే.. కండరాల తిమ్మిరి.. మెగ్నీషియం కండరాల పనితీరుకు, కండరాల సంకోచ వ్యాకోచాలలకు కీలకమైనది. దీని లోపం వల్ల కనిపించే మొదటి లక్షణం కండరాల తిమ్మిరి. బయటకు వ్యక్తం చెయ్యలేనంత కండరాల బిగుతు, కండరాలు మెలితిప్పినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటే మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలసట, బలహీనత.. మెగ్నీషియం శరీరంలో శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల అలసట, బలహీనతకు ఏర్పడతాయి. తరచుగా నీరసంగా అనిపించడం లేదా రోజువారీ పనులు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మెగ్నీషియం లోపం ఉందని అర్థం. హృదయ స్పందన క్రమబద్దంగా లేకపోవడం.. మెగ్నీషియం స్థిరమైన హృదయ స్పందనకు దోహదం చేస్తుంది. దీని లోపం అరిథ్మియా లేదా హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా మారడానికి దారితీస్తుంది. గుండెదడ లేదా గుండె కొట్టుకోవడంలో అసమానతలు గమనించినట్లయితే ముందుగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వికారం, ఆకలి లేకపోవడం.. వికారం, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలు మెగ్నీషియం లోపంతో ముడిపడి ఉండవచ్చు. ఈ ఖనిజం జీర్ణవ్యవస్థ సరైన పనితీరులో పాల్గొంటుంది. ఇది లేకపోవడం వల్ల సాధారణ జీర్ణ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. ఎప్పుడూ జీర్ణాశయం అసౌకర్యం ఎదురవుతుంటే మెగ్నీషియం లోపం ఉందని అర్థం. కాల్షియం స్థాయిలు.. మెగ్నీషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని, నరాల పనితీరును సక్రమంగా ఉంచడానికి కలిసి పనిచేస్తాయి. ఇవి లోపిస్తే కండరాల తిమ్మిరి సంకోచ వ్యాకోచాలలో ఇబ్బంది సహా అనేక సమస్యలకు దారితీస్తుంది. *నిశ్శబ్ద.
read moreబోర్లా పడుకునే అలవాటు మీకూ ఉందా? అయితే మీరు ఇది చదవాల్సిందే..!
కంటినిండా నిద్రపోతే చాలు.. అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం నిద్రపోవడమే కాదు.. ఎలా నిద్రపోతున్నాం అనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే భంగిమ మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటారు. సాధారణంగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవడం ఆరోగ్యం అంటారు. ఇలా కాకుండా కుడివైపుకు తిరిగి పడుకోవడం అస్సలు మంచిది కాదని అంటారు. ఇవి రెండూ కాకుండా కొందరికి బోర్లా .. పొట్టను నేలకు ఆన్చి పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా పొట్టను కిందుగా ఉంచి నిద్రపోవడం వల్ల భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అసలు బోర్లా.. పొట్టను కిందకు పెట్టి పడుకోవడం వల్ల కలిగే సమస్యలేంటి? తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నిద్ర విధానం భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ వీపును నిటారుగా ఉంచి నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒక వైపు తిరిగి నిద్రించడానికి ఇష్టపడతారు. కానీ మరికొందరు పొట్టను కిందకు వేసుకుని నిద్రపోతారు. ఇలా పడుకోవడం సౌకర్యంగానూ, మంచి నిద్రను ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇది హానికరం. శరీర నొప్పి.. కడుపు కిందకు వేసుకుని నిద్రపోవడం వల్ల శరీర నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇది మొదట్లో సౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది, దీని కారణంగా వెన్నునొప్పికి గురవుతారు. ఇది కాకుండా మెడ నొప్పిని కూడా కలిగిస్తుంది. వెన్నెముకకు మంచిది కాదు.. బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ భంగిమలో పడుకోవడం మానుకోవాలి. రొమ్ము నొప్పి.. మహిళల్లో రొమ్ము నొప్పికి తరచుగా బోర్లా నిద్రపోవడమే కారణం. ఈ భంగిమలో రొమ్ములపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. రోజూ ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల రొమ్ము నొప్పి ఫిర్యాదులు వస్తాయి. జీర్ణక్రియ తగ్గుతుంది.. బోర్లా నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ స్థితిలో జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చర్మానికి హానికరం.. బోర్లా పడుకున్నప్పుడు ముఖం దిండుపై ఉంటుంది. దీని కారణంగా దిండులో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖానికి తగలడం వల్ల ముఖ చర్మానికి హాని కలిగుతుంది. ఇది మొటిమలు , చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోవడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దాని వల్ల చర్మం మీద తొందరగా ముడతలు వస్తాయి. నిద్రించడానికి మంచి భంగిమ ఏది? నిద్రపోతున్నప్పుడు మెడ, వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర కోసం మెత్తగా తేలికపాటి దిండ్లను ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ఎడమ వైపున నిద్రించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణతో ఆరోగ్యకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreఅధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి తింటే కంట్రోల్ చేయచ్చు..!
చలికాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. సరైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది ధమనుల పనితీరును దెబ్బతీస్తుంది. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అన్ని రకాల కొలెస్ట్రాల్ హానికరం కాదు. సాధారణంగా కొలెస్ట్రాల్ గుండెకు కూడా మేలు చేస్తుంది, దీనిని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు . అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? ఆహారం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఎలా తగ్గించవచ్చు? తెలుసుకుంటే.. కొలెస్ట్రాల్ ఎందుకు ముఖ్యం? శరీరంలో కణ త్వచం, కణాల బయటి పొరను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది కణంలోనికి, బయటికి వెళ్లే వాటిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు శరరంలో తయారు కావడానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం. ఈ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చాలా అవసరమవుతుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం అది హానికరంగా పేర్కొంటారు. చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి? చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అతి పెద్ద కారణం ఆహారం. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులు సులువుగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం అవసరం. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు దీనికి ప్రత్యేకంగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుంటే.. గింజలు లేదా నట్స్.. బాదం , వాల్‌నట్స్ వంటి నట్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. అసంతృప్త కొవ్వులతో పాటు, కరిగే ఫైబర్ కూడా వీటిలో ఉంటుంది, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మితంగా మాత్రమే తినాలి. వోట్మీల్.. వోట్మీల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో,, కరిగే ఫైబర్‌తో పాటు, అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. బెర్రీస్.. బెర్రీస్‌లో ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి. ఆపిల్.. యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. *నిశ్శబ్ద.
read moreఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
ములక్కాడల గురించి అందరికీ తెలిసిందే.. అయితే మునగ ఆకుల గురించి, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. నిజానికి మునగ ఆకు గ్రామాలలో విరివిగా దొరికినా వాడేవారు తక్కువ. కానీ మునగ ఆకులను నీళ్లలో ఉడికించి ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మునగచెట్టును సాధారణంగానే మిరాకిల్ ట్రీ అని అంటారు. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు మునగాకులో పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. మునగ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు , ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో మునగాకు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం సహాయపడుతుంది. బరువు తగ్గడం.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగడం వల్ల జీవక్రియను పెంచడం, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది, అనారోగ్యకరమైన ఆహారాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.. మునగ ఆకుల నీరు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మొరింగ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గించడానికి, ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సి చేస్తుంది.. ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగడం వల్ల శరీరాన్ని శుద్ది చేసి హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. మునగ ఆకులలో డిటాక్సిఫైయింగ్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. తద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎనర్జీ.. రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తాగుతూ ఉంటే రోజంతా అవసరమైన శక్తిని పొందవచ్చు. మునగ ఆకులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలు, కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి అవసరం. ఐరన్ లోపం ఉంటే అలసట, నీరసానికి దారితీస్తుంది, రోజువారీ పనులను చేయడం కష్టతరం చేస్తుంది. మునగ ఆకుల నీటిని ఎలా తయారుచేసుకోవాలి అంటే.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ ఎండిన మునగ ఆకులు లేదా పొడి ఒక సాస్పాన్లో ఒక కప్పు నీటిని మరిగించండి. వేడినీటిలో ఒక టీస్పూన్ ఎండిన మునగ ఆకులు లేదా అరస్పూన్ పొడిని కలపండి. ఇది 5-7 నిమిషాలు ఉడకనివ్వండి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టండి. మునగ ఆకుల నీటిని వేడిగా తాగవచ్చు లేదా కాస్త చల్లగా అయ్యాక కూడా తీసుకోవచ్చు. రుచిని మెరుగుపరచడానికి నిమ్మకాయ లేదా తేనెను కూడా జోడించవచ్చు. *నిశ్శబ్ద.
read more30ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..!
శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆహారం విషయంలో చాలా శ్రద్ద అవసరం. అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. యవ్వనంలోకి అడుగు పెట్టిన తరువాత ఇక 30ఏళ్లు దాటగానే శరీరంలో శక్తి స్థాయిలు క్రమంగా తగ్గిపోతూ వస్తాయి. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు 30ఏళ్ల తరువాత శరీరంలో మెల్లిగా డవలప్ అవుతాయి. ఇవేవీ రాకూడదు అంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు, శారరీక మార్పులు కూడా దీనికి దోహదం చేస్తాయి. అందుకే 30ఏళ్ల తరువాత ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుని వాటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం. కాల్షియం.. శరీరం, ఎముకల పటిష్టతకు కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకం. 30ఏళ్ల తరువాత కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకల బలహీనతకు కారణమయ్యే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, బలవర్ధకమైన ఆహారాలు ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్-డి.. శరీరం, ఎముకల పటిష్టతకు కాల్షియం ఎంత అవసరమో, అదే విధంగా విటమిన్ డి కూడా అవసరం. ఇది కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. విటమిన్-డి కోసం లేత ఎండలో గడపచ్చు, కొవ్వు చేపలు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు మొదలైనవి తినవచ్చు. మెగ్నీషియం.. మెగ్నీషియం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. కండరాల పనితీరుకు, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. దీని కోసం గింజలు, తృణధాన్యాలు, ఆకు కూరలు తినవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, మెదడు పనితీరును ప్రోత్సహించడానికి అవసరమైన పోషకాలు. అంతే కాకుండా శరీరంలో వాపులను తగ్గించి మెదడు శక్తిని పెంచేలా పనిచేస్తుంది. దీని కోసం అవిసె గింజలు, సాల్మన్ చేపలు, వాల్‌నట్స్ వంటి వాటిని తీసుకోవడం పెంచవచ్చు. విటమిన్-బి12 నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ పోషకం అవసరం. ఇది కండరాలు, ఎముకలకు బలాన్ని అందించడానికి పనిచేస్తుంది. దీని కోసం మాంసం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన ఆహారాలు తినవచ్చు. పొటాషియం.. 30ఏళ్ల తరువాత రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం అరటిపండు, బత్తాయి, బచ్చలికూర, బీన్స్ వంటి వాటిని తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్.. సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి, ఉదర సంబంధ సమస్యలను నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ఫైబర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాకుండా బరువును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీని కోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ మొదలైనవాటిని చేర్చుకోవచ్చు. అదేవిధంగా, శరీర అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం. *నిశ్శబ్ద.
read moreఅంజీర్ పండ్లను పాలతో కలిపి తాగితే కలిగే...ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
పాలు ఆరోగ్యకరమైన పదార్థం. పోషకాహారంలో పాలకు కూడా చోటుంది. అయితే పాలను సాధారణంగా కాకుండా మరింత రుచిగా తీసుకోవడానికి కొందరు పండ్లు జోడిస్తారు. మరికొందరు మిల్క్ షేక్ లు చేసుకుని తాగుతారు. కొందరు పాలు, తేనె మిశ్రమం తీసుకుంటారు. పాలతో ఖర్జూరం కూడా తీసుకునేవాళ్లు ఉన్నారు. కానీ పాలతో అంజీర్ కలిపి తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. అంజీర్ ను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. అంజీర్ పోషకాలతో నిండిన డ్రై ఫ్రూట్. విటమిన్ ఎ, బి, కె, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి ఉంటాయి. పాలు, అంజీర్ రెండూ కలిస్తే శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. పోషకాహార లోపంతో బాధపడేవారు ఈ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటే చాలా సహాయపడుతుంది. జీర్ణాశయానికి.. అంజీర్ డైటరీ ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా నడుపుతుంది. అంజీర్‌లోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరోవైపు పాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, ప్రేగుల ఆరోగ్యానికి మరింత సహాయపడతాయి. రెండూ కలిస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడటానికి, జీర్ణాశయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శక్తి .. అంజీర్‌లోని సహజ చక్కెరలు శక్తిని అందిస్తాయి. పాలతో కలిపినప్పుడు ప్రోటీన్లు, కొవ్వుల కారణంగా ఈ శక్తి విడుదల ఎక్కువసేపు ఉంటుంది. ఇది తక్షణ శక్తిని మాత్రమే కాకుండా ఎక్కువసేపు నిలకడగా శక్తిని సమకూర్చి శరీరాన్ని బలంగా ఉంచుతుంది. మధ్యాహ్న సమయంలో శక్తి పుంజుకుని పనిచేయడానికి లేదా ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా అయినా ఇది చాలా బాగుంటుంది. చర్మం, జుట్టు పోషణ.. అంజీర్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ,చర్మం రంగు మెరుగుపడటానికి , చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే లాక్టిక్ యాసిడ్ పాలతో ఉంటుంది. పాలు, అంజీర్ రెండూ కలిపి తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. అదేవిధంగా జుట్టు పెరుగుదల బాగుంటుంది. బరువు.. బరువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి అంజీర్ , పాలు కాంబినేషన్ బెస్ట్ ఎంపిక. ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి నియంత్రిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్ కండర ద్రవ్యరాశిని సంరక్షించడంలో సహాయపడుతుంది. పాలు, అంజీర్ కలిపి తీసుకుంటే అటు శరీరానికి పోషణ ఇస్తూ, మరోవైపు బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreనిద్ర బాగా రావాలంటే స్లీప్ హార్మోన్ అవసరం.. ఇదేంటో.. దీన్నెలా పెంచుకోవాలో తెలుసా?
నిద్ర గొప్ప ఔషదం అని అంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రాత్రి మంచి నిద్ర రావడానికి కూడా ముఖ్యమైనవి. రాత్రి సమయంలో 6-8 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోవడం ఎంతో అవసరం. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు, హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతుంది. అయితే నిద్ర బాగా పట్టాలంటే శరీరంలో తగినంత మెలటోనిన్ అవసరం. దీన్నే స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. మన శరీరం సహజంగానే ఈ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. బయట చీకటి పడడం ప్రారంభించినప్పుడు శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ కొందరిలో ఈ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల నిద్ర విషయంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఏర్పడే సమస్యలేంటి? నిద్ర బాగా పట్టాలంటే అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మెలటోనిన్ తగినంత ఉత్పత్తి కావడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే.. నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు.. కనీసం ఒక్క రాత్రి అయినా సరే సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసట, కోపం, చిరాకు వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కొన్ని వారాల పాటు కొనసాగితే నిద్ర సమస్యలు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి నిద్ర కోసం ప్రయత్నం చెయ్యాలి. కొన్ని పనులు చేయడం ద్వారా సహజంగా శరీరంలో మెలటోనిన్ స్థాయిని పెంచుకోవచ్చు. సూర్యరశ్మి.. సూర్యకాంతిలో ప్రతిరోజూ కొంత సమయం గడపడం వల్ల విటమిన్ డి ఉత్పత్తిని మాత్రమే కాదు మెలటోనిన్ కూడా ఉత్పత్తి కావడంలో సహాయపడుతుంది. ఉదయం కనీసం 15 నిమిషాల పాటు ఎండలో ఉండడం చాలా ముఖ్యం. ఇది మెలటోనిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొందరు రాత్రిపూట నిద్ర సరిగా లేకపోవడం వల్ల పగటిపూట కనుకుపాట్లు పడుతుంటారు. అయితే ప్రతిరోజూ తగినంత సేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల ఈ సమస్య తొలగిపోయి రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది. గది వాతావరణం.. మంచి నిద్ర రావాలన్నా, మెలటోనిన్ స్థాయిలను మెరుగుపరచాలన్నా నిద్రపోయే గది వాతావరణాన్ని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగవుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గదిని చీకటిగా ఉంచడం వల్ల రాత్రిపూట తరచుగా నిద్రకు అంతరాయం ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ సమయం.. స్క్రీన్ సమయాన్ని అంటే మొబైల్-కంప్యూటర్‌లో గడిపే సమయాన్ని తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. నిద్రించడానికి కనీసం గంట ముందు కంప్యూటర్, డిజిటల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఈ పరికరాల నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ టైమ్ నిద్ర సమస్యలను పెంచడమే కాకుండా శరీరంలోని అనేక ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. *నిశ్శబ్ద.
read moreఅయ్యబాబోయ్.. డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో..!
డార్క్ చాక్లెట్ నలుపు రంగులో కాసింత చేదుగా ఉండే చాక్లెట్. దీని వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాధారణ చాక్లెట్లతో పోలిస్తే డార్క్ చాక్లెట్ పూర్తీ విభిన్నం. డార్క్ చాక్లెట్ లో కోకో ఎక్కువగానూ, పాల పదార్థాల పరిమాణం, చక్కెర శాతం తక్కువగానూ ఉంటాయి. ఈ కారణంగా డార్క్ చాక్లెట్ తింటే సాధారణ చాక్లెట్లలా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగుతాయనే భయం అంటారు. సాధారణ చాక్లెట్లతో పోలిస్తే ధర పరంగా ఎక్కువగా ఉన్నా దీన్ని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెబుతున్నారు. అసలు డార్క్ చాక్లెట్ ఎందుకు ఉత్తమమైనదిగా పరిగణింపబడుతుంది? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. యాంటీ ఆక్సిడెంట్లు.. డార్క్ చాక్లెట్ ను దీని చేదు రుచి కారణంగా సాధారణంగా బేకింగ్ చాక్లెట్ గా ఉపయోగిస్తారు. దీంట్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఇందులో ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఆక్సీరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడతాయి. రోజూ ఓ చిన్నముక్క డార్క్ చాక్లెట్ తింటుంటే చాలా లాభాలు ఉంటాయ్. పోషకాలు ఎక్కువ.. డార్క్ చాక్లెట్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో అనేక విధులకు సహాయపడతాయి. ముఖ్యంగా చిరాగ్గా ఉన్న మూడ్ ను నార్మల్ గా చేసుకోవాలన్నా, హ్యాపీ హార్మోన్స్ ను యాక్టీవ్ చేయాలన్నా డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదం.. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు హృదయనాళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం ద్వారా డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. రోజులో కాసింత డార్క్ చాక్లెట్ తింటే హృదయనాళ వ్యవస్థ బలపడుతుంది. మెదడు పనితీరు.. డార్క్ చాక్లెట్ లో కెఫిన్, ఇతర సమ్మేళనాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుచురుగ్గా పనిచేయడంలోనూ, జ్ఞాపకశక్తని పెంచడంలోనూ, ఏకాగ్రత పెరగడంలోనూ డార్క్ చాక్లెట్ చాలా బాగా సహాయపడుతుంది. మానసిక స్థితికి.. డార్క్ చాక్లెట్‌లో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజూ ఓ ముక్క డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల సంతోషానికి కారణమయ్యే ఎండార్ఫిన్‌ల విడుదల బాగుంటుంది. ఇది మానసిక స్థితిని సహజంగానే బాగుండేలా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డార్క్ చాక్లెట్ మంచి మూడ్ బూస్టర్. *నిశ్శబ్ద.
read moreఈ అయిదు జబ్బులకు మందులు అస్సలు అక్కర్లేదు.. కేవలం ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు..!
ఆహారమే ఔషదం అని అంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం, అనారోగ్యానికి గురి కావాలంటే అనారోగ్యకర ఆహారం కారణం అవుతాయి. సాదారణంగా ఏదైనా జబ్బు చేయగానే చాలామంది మందులు తీసుకుని సమస్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యం మీద భయంతో కొన్నిసార్లు వైద్యులను సంప్రదించేవారు కొందరైతే.. చీటికి మాటికి చిన్న జబ్బులకు కూడా మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడేవారు కొందరు. కానీ సాధారణంగా అందరికీ వచ్చే అయిదు రకాల జబ్బులకు అస్సలు మందులు వాడాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ జబ్బులను లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. ఇవి ఆహారంలో మార్పులు చేసుకోగానే తగ్గిపోతాయి. ఆ జబ్బులు ఏంటో.. దానికి తీసుకోవలసిన ఆహారం ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. ప్రస్తుతం ఎవ్వరిని గమనించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది. పూర్తీ ఫిట్ గా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ప్రమాదం అనుకునే అయిదు రకాల వ్యాధులు మాత్రం ఆహారంతోనే తగ్గిపోతాయనే షాకింగ్ నిజం బయటపడింది. ఆహారంతో తగ్గిపోయే వ్యాధులలో టైప్ 2 మధుమేహం ఒకటి. మధుమేహం ఉన్నవారు జీవితాంతం ఇన్సులిన్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని తిప్పికొట్టవచ్చట. ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మరణాలకు కారణమవుతున్న జబ్బులలో గుండె జబ్బు మొదటిది. గుండె జబ్బులు వాటి సిరలకు వచ్చే సమస్యలతో ముడిపడి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, బిపి, అధిక బరువు గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి వీటిని నియంత్రణలో ఉంచుకుంటే గుండె జబ్బులు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా నయమవుతాయి. గుండె పోటు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మూడు కలిసి మెదడుమీద ప్రభావం చూపిస్తాయి. ఇవి స్ట్రోక్ కు కారణం అవుతాయి. మెదడు నరాలు పగిలినప్పుడు లేదా మెదడుకు రక్తప్రసరణ మందగించినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ముఖ్యం. అవే ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తం సిరల్లో అధిక వేగంతో ప్రసరించినప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అని అంటారు. ఇలా జరిగినప్పుడు గుండె ఎక్కువ శ్రమకు గురవుతుంది. నరాలు బలహీనపడతాయి. బిపి 120/80mmHg కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండకూడదు. శరీరంలో పుట్టెడు జబ్బులకు కేవలం ఉబకాయం మాత్రమే ప్రధాన కారణం అవుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధికబరువు ఉన్నవారు కూడా ఆహారంలో మార్పులు, వ్యాయామం రెండూ చేస్తే బరువు తగ్గుతారు. చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కానీ నిజానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు బయటకు వ్యక్తం చేస్తారు, మరోవైపు ఆహారం, వ్యాయామం విషయాల్లో సీరియస్ గా ఉండరు. అందుకే బరువు తగ్గరు. పై అయిదు సమస్యలకు కేవలం ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. *నిశ్శబ్ద.
read moreఈ ఆహారాలు షుగర్ ఉన్నవారికి అమృతంతో సమానం!
మధుమేహం చాలా తేలికగా అనిపించే సమస్య. ఇది చాలామందిలో కామన్ అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ మధుమేహంతో బాధపడేవారికే ఈ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆహారం దగ్గర చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఏం తినాలన్నా, తాగాలన్నా సతమతం అయిపోతుంటారు. దీనికి తగినట్టు మధుమేహం ఉన్నవారిలో బరువు పెరగడం అనే సమస్య కూడా ఉంటుంది. కానీ కొన్ని ఆహారాలు రుచితో పాటూ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో తెలుసుకుంటే.. స్ట్రాబెర్రీలు, గ్రీన్ యాపిల్స్.. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు ఆకలిని నియంత్రించడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గ్రీన్ యాపిల్ కరిగే ఫైబర్‌ను అందిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు గొప్ప పండు. బ్లూ బెర్రీస్, గుమ్మడికాయ.. బ్లూ బెర్రీస్ విదేశాలలో పండటం మూలానా ఇవి భారతీయులకు అరుదుగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మధుమేహానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గుమ్మడికాయలో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో నీటి కంటెంట్ ఎక్కువ. దీని కారణంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. పెసలు.. పెసలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తూ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా ఎక్కువసేపు ఆకలిని నియంత్రించి బరువును నియంత్రణలో ఉంచుతుందియ. కాల్చిన శనగలు, శనగపిండి.. శనగపిండి అయినా, కాల్చిన లేదా వేయించిన శనగలు అయినా మధుమేహం ఉన్నవారికి మంచివి. శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఆహారం కావడానికి ఇదే కారణం. ఇది శరీరానికి శక్తిని అందించడానికి, బరువును నియంత్రించడానికి చక్కని ఎంపిక. బీట్రూట్.. బీట్రూట్ తీసుకోవడం ద్వారా అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. దీని వినియోగం రక్తపోటును తగ్గిస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. తక్కువ కేలరీలు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పదార్థాన్ని తీసుకోవడం బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మిల్లెట్స్.. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మిల్లెట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శక్తిని ఇస్తుంది, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బరువును మైంటైన్ చేయడంలలో సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreరోజూ ఓ కప్పు లవంగాల టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
టీ అనేది భారతీయులు తీసుకునే పానీయాల్లో చాలా గాఢంగా భాగమైపోయింది. టీని సాదారణంగా పాలతోనూ, టీ ఆకుతో మాత్రమే కాకుండా వివిధ సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల సహాయంతో తీసుకుంటారు. వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో భాగమైన లవంగాలతో టీ చేసుకుని తాగడం వల్ల వెలకట్టలేని లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఓ కప్పు లవంగాల టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, దీన్ని ఎప్పుడు తీసుకుంటే మంచిది అనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. యాంటీఆక్సిడెంట్లు.. లవంగం టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు. జీర్ణక్రియ.. లవంగం టీ సాంప్రదాయకంగా జీర్ణ సంబంధ సమస్యల కోసం ఉపయోగిస్తారు. లవంగాలలోని క్రియాశీల సమ్మేళనాలైన యూజినాల్, జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడానికి, మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి.. లవంగం టీ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను మెండుగా కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్- సి, కె ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. శ్వాసకోశ సమస్యలు.. లవంగం టీ సువాసన దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. లవంగాలలోని యూజినాల్ ఒక ఎక్స్‌పెక్టరెంట్‌గా పనిచేస్తుంది, శ్లేష్మాన్ని విప్పుటకు, వాయుమార్గాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. వాపులు.. లవంగం టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లను కలిగి ఉండే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, తలనొప్పి, ఇతర తాపజనక లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగం టీ తాగడానికి మంచి సమయం ఏది? రోజులో ఏ సమయంలోనైనా దీన్ని తాగవచ్చు. అయినప్పటికీ దీనివల్ల మెరుగైన ఫలితాలు కావాలంటే ఇది తాగడానికి వేర్వేరు సమయాలు కూడా ఉన్నాయి. ఒక కప్పు గోరువెచ్చని లవంగం టీతో రోజును ప్రారంభించడం వలన జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతినకుండా కాపాడతాయి. రోజంతా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. భారీ భోజనం తర్వాత ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గించడంలో లవంగం టీ సహాయపడుతుంది. కాబట్టి యాంటాసిడ్‌ని తీసుకోకుండా జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనం తర్వాత ఒక కప్పు లవంగం టీని త్రాగడానికి ప్రయత్నించడం మంచిది. పడుకునే ముందు లవంగం టీ త్రాగవచ్చు. వెచ్చని సువాసన, రుచి మనస్సు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తుంది. వాతావరణం పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటే ఒక కప్పు లవంగం టీ ఉపశమనాన్ని అందిస్తుంది. లవంగాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. వెచ్చని ఆవిరి గొంతు నొప్పిని, రద్దీని తగ్గిస్తుంది. లవంగం టీ సాంప్రదాయకంగా నెలసరి సమయంలో కడుపు నొప్పి, కండరాల తిమ్మిరి, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నెలసరిలో వచ్చే తిమ్మిరి, అసౌకర్యం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మహిళలకు సహజమైన, సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుంది. లవంగం టీ ఎలా తయారుచేయాలి? ఇంట్లో లవంగం టీని తయారు చేయడానికి ఒక కప్పు వేడి నీటిలో 1-2 లవంగాలు వేసి 5-10 నిమిషాలు స్థిరమైన మంటమీద ఉడికించాలి. అదనపు రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఓ ముక్క దాల్చినచెక్క, అల్లం లేదా తేనె వంటి ఇతర పదార్థాలను కూడా జోడించవచ్చు. దీన్ని చాలా వేడిగా కాకుండా కాసింత వెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. *నిశ్శబ్ద.
read moreఈ జపనీస్ థెరపీతో ఒత్తిడి మటుమాయం.!
సాంకేతిక ప్రపంచంలో జీవిస్తున్నాము. ప్రతిరోజూ ఒకే పని, అదే వాతావరణం, ఒకే ప్రయాణం చేయడం బోరింగ్ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకవైపు ఆఫీసు పని ఒత్తిడి, మరోవైపు ఇంట్లో సమస్యలు. ఈ పనులన్నింటితో శరీరం,మనస్సు అలసిపోతుంది. దీని కారణంగా చాలా మంది తరచుగా నిరాశ, ఆందోళన, ఒత్తిడి శారీరక రుగ్మతలను ఎదుర్కోవలసి వస్తుంది.దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు మీ ఖాళీ సమయంలో పురాతన జపనీస్ థెరఫీలను అనుసరించవచ్చు. దీంతో పని ఒత్తిడి, మానసిక కుంగుబాటు, ఆఫీసులో ఆందోళన వంటి అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీని కారణంగా మీరు ప్రతిరోజూ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. 'షిన్రిన్-యోకు' థెరపీ అంటే ఏమిటి? మీరు ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ పురాతన జపనీస్ ఔషధాన్ని అభ్యసించాలనుకుంటున్నారు. ఈ చికిత్సను జపనీస్ భాషలో 'షిన్రిన్ యోకు' అని పిలుస్తారు, దీనిని సాధారణంగా 'అటవీ స్నానం' అని పిలుస్తారు. ప్రకృతి వాతావరణానికి అనుగుణంగా జీవించడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను నయం చేయవచ్చు. అందువల్ల 'షిన్రిన్ యోకు' యొక్క చికిత్సా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ చికిత్స కోసం, మీరు అడవిలో నడవడం, కూర్చోవడం, నిలబడటం లేదా స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. దీనితో మీరు చాలా విషయాలను మరచిపోయి ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందుకే దీనిని అటవీ చికిత్స అని కూడా పిలుస్తారు. అంటే అడవి వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించడం. ఇది 1980లలో జపాన్‌లో ఉద్భవించిన చికిత్స. ఇక్కడ ప్రజలు అడవిలోని దృశ్యాలు, శబ్దాలు,వాసనలలో మునిగిపోయేలా ప్రోత్సహించడం. వీటిలో ప్రయాణం, ధ్యానం, కొన్ని అందమైన ప్రదేశంలో కొంత సమయం గడపడం వంటివి ఉన్నాయి. దీని వల్ల మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. ప్రకృతి మధ్య సమయం గడపడం వల్ల మనసులో వచ్చే ఆలోచనలు తగ్గుతాయి. జపనీస్ షిన్రిన్ యోకు థెరపీ నిజంగా ప్రయోజనకరంగా ఉందా? షిన్రిన్ యోకు మానసిక ఆరోగ్య రంగంలో ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కోసం శక్తివంతమైన చికిత్సా పద్ధతిగా ఉద్భవించింది. శాంతి, ఉనికి యొక్క భావాన్ని ప్రోత్సహిస్తుంది. అనేక భౌతిక విషయాల నుండి వేరు చేయడానికి అనుమతిస్తుంది. అడవిలోని ప్రశాంతతలో గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అభ్యాసం ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పనిలో ఏకాగ్రత వహించడంలో మీకు సహాయపడుతుంది. ఇది కాకుండా ఈ థెరపీ మీ బర్న్‌అవుట్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ కొంత సమయం ప్రకృతిలో గడిపితే మానసిక ఒత్తిడి, అనారోగ్యం, శారీరక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. షిన్రిన్ యోకు థెరపీ ఎలా చేయాలి? ప్రతి ఒక్కరూ అడవిలోకి వెళ్లి ప్రతిరోజూ షిన్రిన్ యోకు థెరపీ చేయలేరు. అలా చేయలేని వారు సమీపంలోని పార్క్ లేదా ప్రశాంతమైన గార్డెన్‌కి వెళ్లి షిన్రిన్ యోకు థెరపీ చేయించుకోవచ్చు. తద్వారా మీరు శారీరక, మానసిక వ్యాధులకు దూరంగా ఉంటూ సంతోషంగా, ప్రశాంతంగా, ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు.
read moreబాదం పప్పు ఏ సమయంలో తింటే,ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మేలంటే..!
శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఆహారానిదే ప్రధాన పాత్ర. డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు, కాయలు, తృణధాన్యాలు అన్నీ ఆరోగ్యాన్ని చేకూర్చేవే. అయితే వేటిని ఎలా తినాలో అలా తింటే ఆరోగ్యానికి మరింత మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఎండు గింజలలో బాదం పప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాదం పప్పును నానబెట్టి తింటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అయితే బాదం పప్పును ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి? బాదం పప్పులో ఉండే పోషకాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం ముఖ్యంగా కరోనా దాడి పెరిగింది. చాలామంది ఆరోగ్యం మీద స్పృహతో బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఫైబర్, కార్భోహైడ్రేటెడ్లు కూడా ఉంటాయి. శరీరానికి పోషణ ఇవ్వడం నుండి బరువు తగ్గడం వరకు ఇవి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అయితే బాదం పప్పులు ఏ సమయంలో తింటే ఏం జరుగుతుందో? ఎప్పుడు తింటే ఎక్కువ లాభాలు ఉంటాయో చాలామందికి తెలియదు. సాధారణంగా అందరూ తిన్నట్టు ఉదయం సమయంలో నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసి తినడం వల్ల గరిష్ట ప్రయోజానాలు ఉంటాయి. రోజు మొత్తం శక్తివంతంగా ఉంచుతుంది. ఉదయాన్నే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామం చేసే అలవాటు ఉంటే వ్యాయామానికి ముందు బాదం పప్పు తినడం వల్ల శరీరం తొందరగా అలసిపోదు. దీని వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా వ్యాయామం చెయ్యడానికి వీలుంటుంది. బాదం పప్పు కండరాలకు మేలు చేస్తాయి. ఈ కారణంగా వ్యాయామం తరువాత కూడా కండరాలు అలసిపోవు. సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా సాయంత్రం ఆయిల్ ఫుడ్, ఉప్పు, కారం జోడించిన ఆహారాలు లేదా పంచదారతో కూడిన పదార్థాలు స్నాక్ గా తింటుంటారు. వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వీటి బదులు సాయంత్రం బాదం పప్పులు తింటే రాత్రి భోజనం వరకు ఆకలి వేధించదు. బాదం పప్పు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కారణంగా షుహర్ కూడా అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. *నిశ్శబ్ద.
read moreఅల్లం, దాల్చిన చెక్క, తేనె...వీటితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
అల్లం, దాల్చిన చెక్క, తేనెను క్రమం తప్పకుండా ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా, శరీరం సులభంగా వ్యాధులకు గురవుతుంది. రోగాలు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి అల్లం, దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకోవాలి. అల్లం, దాల్చిన చెక్కను సాధారణంగా వంటలలో సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో అల్లం, దాల్చిన చెక్క, తేనెను ఔషధాలుగా ఉపయోగిస్తారు.అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, దాల్చినచెక్క, అల్లం, తేనె కషాయాలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందడంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటిని నివారించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం, దాల్చిన చెక్క, తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: అల్లం, దాల్చిన చెక్క, తేనె తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేయవచ్చు. ఇందులో ఉండే పీచు మలబద్ధకం, కడుపునొప్పి,గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. భోజనం తర్వాత అల్లం, తేనె, దాల్చిన చెక్క తినడం వల్ల ఆహారం సక్రమంగా జీర్ణం కావడమే కాకుండా పుల్లటి త్రేన్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది: అల్లం, దాల్చినచెక్క, తేనె కషాయాలను తీసుకోవడం వల్ల శరీరం సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్ సమస్యకు మేలు చేస్తుంది: అర చెంచా దాల్చిన చెక్క పొడిలో అర చెంచా అల్లం పొడి, తేనె కలిపి తింటే ఆర్థరైటిస్‌కి చాలా మేలు చేస్తుంది. ఇందులోని గుణాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: స్థూలకాయం, బరువు సమస్యలతో బాధపడేవారికి అల్లం, దాల్చిన చెక్క, తేనె తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ సమాన పరిమాణంలో అల్లం, దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. అధిక కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది: క్రమబద్ధమైన ఆహారం, చెడు జీవనశైలి కారణంగా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అల్లం, దాల్చిన చెక్క, తేనెను సమాన మొత్తంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
read moreచలికాలంలో అల్లంటీ తాగకూడదా? టీ గురించి షాకింగ్ నిజాలు ఇవీ..!
భారతీయులకు టీ అంటే ఇష్టం. ముఖ్యంగా నగరవాసులు టీను ఎమోషన్ గా ఫీలవుతారు. టీ తాగాలని అనిపిస్తే ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళి టీ తాగేస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో టీ ఎక్కువగా తీసుకుంటారు. చలిని తప్పించుకోవడానికి వేడే వేడి టీ తాగుతుంటే అదొక చెప్పలేని అనుభూతి కలుగుతుంది. చాలామంది రోజు టీతోనే మొదలై టీతోనే ముగుస్తుంది కూడా. పట్టణాలలో చాలాచోట్ల 24గంటలు టీ ఉడుకుతూనే ఉంటుంది. చలికాలంలో టీ ఉత్తమ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పరిగణించబడుతుంది. అయితే టీని ఎక్కువసేపు ఉడికిస్తున్నా, ఒకసారి చేసిన టీని మళ్ళీ మళ్లీ వేడి చేస్తున్నా, చలికాలంలో బాగుంటుంది కదా అని అల్లం టీ తాగుతున్నా ఆరోగ్యానికి ముప్పేనని వైద్యులు చెబుతున్నారు. అసలు టీ ఆరోగ్యానికి ఎలా హానికరమవుతుంది పూర్తీగా తెలుసుకుంటే.. టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే రోజులో కేవలం రెండు నుండి మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తాగకూడదు. ఇకపోతే టీని ఎక్కువ సేపు ఉడికించడం, ఒకసారి తయారైన టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదం. చల్లని వాతావరణంలో అల్లం టీ తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చలికాలంలో తరచుగా వచ్చే మూత్ర విసర్జన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అల్లం టీ తాగవద్దని వైద్యులు చెబుతున్నారు. టీలో అల్లం, లవంగాలు, యాలకులు వేసి ఎక్కువ సేపు ఉడకబెడతారు. ఇలా ఎక్కువసేపు టీని ఉడకబెట్టడం వల్ల టీలో టానిన్ లు ఏర్పడతాయి. ఇది అసిడిటీకి అతి పెద్ద కారణం. టానిన్ అనేది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. ఇది టీ ఆకులలో కనిపిస్తుంది. టానిన్‌లను పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు, అది యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్‌కు కారణమవుతుంది. టీ తాగిన తర్వాత గ్యాస్ ఎక్కువసేపు ఉంటే కడుపులో వాపు వస్తుంది. అందుకే పేగు సమస్యలు ఉన్నవారు టీ తీసుకోవడం తగ్గించాలని చెబుతారు. అంతే కాదు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంటే టీని పూర్తీగా మానెయ్యాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ రోజుకు రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ టీ త్రాగకూడదు. వీలైనంత వరకు అల్లాన్ని టీలో ఎక్కువ సేపు ఉడికించకుండా జాగ్రత్త పడాలి. అలాగే.. ఒకసారి చేసిన టీని చలికాలం కదా అని మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదం. జీర్ణాశయంలో పేగులను విచ్చిన్నం చేస్తుంది. *నిశ్శబ్ద.
read more



.webp)





.webp)
.webp)



.webp)

.webp)


.webp)
.webp)

