నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది. అదే విధంగానే నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా చాలా వరకు ఆరోగ్యంగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నోటి ఆరోగ్యం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నోటి దుర్వాసన, పంటి నొప్పి, చిగుర్ల సమస్యలు వంటివి ఎదురైనప్పుడు, పళ్లు చాలా సున్నితంగా మారిపోయినప్పుడు తప్ప చాలామంది దంతవైద్యులను సంప్రదించడం, దంత సంరక్షణ తీసుకోవడం చేయరు. అయితే నోటి ఆరోగ్యం, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలని అంటున్నారు దంత సంరక్షణ నిపుణులు. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
కావిటీస్ ..
రోజూ రెండు సార్లు పళ్ళు తోముకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం తాలూకు అవశేషాలు తొలగించడంలో సహాయపడుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నమూలాలు చెడు బ్యాక్టీరియాను, ఈ చెడు బ్యాక్టీరియా యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. ఇది దంత క్షయానికి కారణమవుతుంది.
చిగుళ్ల వ్యాధి..
రెగ్యులర్ గా రోజుకు రెండుసార్లు బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళలో మంట, ఇన్ఫెక్షన్ కలిగించే ఫలకం, బ్యాక్టీరియాను తొలగించడం సాధ్యమవుతుంది. ఇవి చిగుళ్ల వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. చిగుళ్ల వ్యాధి చికిత్స చేయకుండా వదిలేస్తే దంతాలకు నష్టం వాటిల్లి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్..
ఇప్పట్లో చాలామంది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌తో బ్రష్ చేస్తుంటారు. మాన్యువల్ టూత్ బ్రష్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు నోటిని పూర్తిగా శుభ్రపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.
సాధారణ దంత పరీక్షలు..
రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు బ్రషింగ్ చేయడం నోటి పరిశుభ్రతను పెంచుతుంది. అలాగే మొత్తం దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉంటే దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయినా ముందుగానే తెలుసుకుని వాటికి తగిన నివారణా చర్యలు తీసుకోవచ్చు.
దంతాల నష్టం ..
రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా దంతాల మీద ఏర్పడే ఫలకం, బ్యాక్టీరియాను క్రమం తప్పకుండా తొలగించడం సాధ్యమవుతుంది. దీనివల్ల క్షయం లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా దంతాలకు కలిగే నష్టాన్ని నివారించవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలకు కలిగే నష్టాన్ని ముందుగానే తెలుసుకుని నివారించాలన్నా నోటి శుభ్రత, నోటి సంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.
*నిశ్శబ్ద.