హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ విషయం లో కటిన నిబందనలు అమలు చేయాలి..
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.
read moreప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు తాగితే స్పెర్మ్ కౌంట్ పడిపోతుందట!
ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని, ప్రాణాంతక వ్యాధులపై.... బెర్లిన్ - జర్మనీలో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బెథాలేట్ అనే రసాయనం నీటిలో కలుస్తుంది. ఆ నీరు త్రాగినప్పుడు, అది రక్తంలో కలిసిపోతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌తో పాటు, నాణ్యత తగ్గుతుందని మెడికల్ కాన్ఫరెన్స్ హెచ్చరిస్తూ, కొన్ని సూచనలు విడుదల చేసింది. 1. చమురును తిరిగి ఉపయోగించ వద్దు 2. పొడి పాలు వద్దు 3. మ్యాగీ క్యూబ్స్ వద్దు 4. కార్బోనేటేడ్ జ్యూసులు వద్దు (లీటరుకు 32 చక్కెర ఘనాలు ఉంటాయి) 5. ప్రాసెస్ చేసిన చక్కెర వద్దు 6. మైక్రోవేవ్ చేసిన తినుబండారాలు 7. ప్రినేటల్ మామోగ్రామ్ వద్దు, కానీ ఎకోమామర్ ఉపయోగించవచ్చు 8. చాలా బిగుతుగా ఉండే బ్రాలను ధరించవద్దు 9. మద్యం వద్దు 10. చల్లగా వున్న భోజనాన్ని మళ్లీ వేడి చేయకూడదు 11. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దు. 12. అన్ని గర్భనిరోధక మాత్రలు మంచివి కావు ఎందుకంటే అవి మహిళ యొక్క హార్మోన్ల వ్యవస్థను మార్చి క్యాన్సర్‌కు కారణమవుతాయి. 13. డియోడరెంట్స్ ప్రమాదకరమైనవి, ముఖ్యంగా షేవింగ్ తర్వాత ఉపయోగించినప్పుడు. 14. డబ్బా పాల కంటే తల్లి పాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. 15. క్యాన్సర్ కణాలు ఎక్కువగా చక్కెర మరియు అన్ని కృత్రిమ చక్కెర, బ్రౌన్ చక్కెరను కూడా తింటాయి. 16. తన ఆహారంలో చక్కెరను మానుకున్న క్యాన్సర్ రోగి తన వ్యాధి తగ్గుముఖం పట్టి దీర్ఘాయుష్షును పొందగలడు. షుగర్ = ప్రాణ శత్రువు. 17. ఒక గ్లాస్ బీర్ శరీరంలో 5 గంటలు ఉంటుంది మరియు ఈ సమయంలో ఈ గ్లాస్ కారణంగా వ్యవస్థ యొక్క అవయవాలు స్లో మోషన్‌లో పనిచేస్తాయి. 18. చక్కెరకు బదులుగా సహేతుకమైన పరిమాణంలో తేనె 19. మాంసానికి బదులుగా బీన్స్ వంటి కూరగాయల ప్రోటీన్లు 20. పళ్ళు తోముకునే ముందు ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నీరు మరియు నిద్ర లేవగానే అదే గది ఉష్ణోగ్రత వద్ద గదిలో ఉంచిన నీరు త్రాగాలి 21. క్యాన్సర్ నిరోధక రసం: కలబంద + అల్లం + పార్స్ లీ + సెలెరీ + బ్రోమెలైన్ (పైనాపిల్ మిడిల్).. మిక్స్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. 22. ప్రతి రోజూ పచ్చి లేదా వండిన క్యారెట్లు లేదా వాటి రసాన్ని తినండి/త్రాగండి. 23. ప్లాస్టిక్ కప్పులో టీ తాగవద్దు 24. కాగితం లేదా ప్లాస్టిక్ సంచిలో వేడి తినుబండారాలు ఏమీ తినవద్దు. ఉదాహరణ: బంగాళదుంపలు (ఫ్రైస్). 25. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ని ఉపయోగించవద్దు - ఎం.కె. ఫజల్
read moreఎండుద్రాక్ష నానబెట్టి తినమని చెప్పేది ఇందుకే!
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు. ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం గుండెకు చాలా మంచిది. నానబెట్టన ఎండు ద్రాక్ష శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది . ఇది ధమనులలో ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్, గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల పదే పదే ఆకలి అనిపించదు. ఆహారం ఎక్కువగా తినాలనే కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి రక్తం, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreవేసవికాలంలో తాటిముంజలు తింటే కలిగే లాభాలు ఇవే..!
ఐస్ యాపిల్ అని ఇంగ్లీషులో అంటుంటారు. వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు. లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది. ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. తాటిముంజలలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను.. జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా బరువు పెరుగుతారు. ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్.. తాటిముంజలు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. *రూపశ్రీ.
read moreపచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది. చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది. ◆నిశ్శబ్ద.
read moreనెయ్యి వాడితే వచ్చే పరిణామాలు ఇవే..
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.
read moreయూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న వారు వేసవిలో ఈ పండ్లు తింటే మంచిది..!
శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం, త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్ వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. బెర్రీలు జీవక్రియను పెంచడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి రెడ్ చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి, జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది. రోజువారీ పనులు చేయడానికి తగినంత శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. *రూపశ్రీ.
read more80రోగాలను నయం చేయగల అరటిపండు అందరికీ సేఫ్ కాదు..
అరటి చాలా శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది. ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు, ఎక్కువ కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో అగ్నితత్వం బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు, జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి. *నిశ్శబ్ద
read moreపడుకునే ముందు తేనె, ఖర్జూరం కలిపి తింటే కలిగే లాభాలు తెలుసా..!
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ఖర్జూరాలు రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు తేనె, ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి), విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి. *రూపశ్రీ.
read moreవేసవిలో సత్తు పొడిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో ఎక్కువగా పండ్లు, కూరగాయల రసాలను తాగుతారు. ఇది మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి. ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు.. సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది. *రూపశ్రీ.
read moreకిడ్నీ క్యాన్సర్ కు ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమం!
కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్ అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.
read moreసమ్మర్ లో టమోటా జ్యూస్ తాగితే కలిగే లాభాలివీ..!
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే.. అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే.. సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. టమోటా లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి. ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది. టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది. టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది. *రూపశ్రీ.
read moreఎండాకాలంలో రోజూ ఎండుద్రాక్ష నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని, మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది. అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది. ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో, పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. *రూపశ్రీ.
read moreవేసవిలో బాదం పప్పు తినడం మంచిదేనా? అసలు నిజాలు ఇవీ!
బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు. అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి. అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు. జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి. అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు. *నిశ్శబ్ద.
read moreవేసవికాలంలో సోపు తింటే కలిగే లాభాలేంటో తెలుసా?
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది. కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
read moreరాత్రి తొందరగా భోజనం చేయమని పెద్దవాళ్లు చెప్పేది ఇందుకే!
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం, ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు.. గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు. ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య సమయం ఉండచం వల్ల ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది. ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది. దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్ ఆరోగ్యకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreవేసవికాలంలో జీర్ణ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు!
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో వేడి, తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి. ఇది మలబద్ధకం, అతిసారం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి ఆయుర్వేద చెప్పిన చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది. మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం. వెచ్చని, తాజాగా వండిన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది. ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు, జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర, ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు, గ్యాస్, ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది. కెఫిన్, స్పైసీ ఫుడ్, కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి. కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన, సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం. జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా రోజంతా చిన్న మొత్తాలలో తినాలి. ఇది జీర్ణవ్యవస్థపై అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు, శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ), భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన), బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి, జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం, నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం. *రూపశ్రీ.
read more


.webp)
.webp)









.webp)
.webp)

.webp)
.webp)


.webp)
.webp)
