నీళ్ళతో వ్యాధులు మయమవుతాయంటే నమ్ముతారా. ఇదేమి కొత్తగా కనిపెట్టిన చికిత్స కాదు. మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ వస్తున్నవిధానమే, ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త పోకడలతో వాటర్ థెరఫీగా మళ్లీ మనముందుకొచ్చింది. ఈ చికిత్సతో ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు వైధ్యులు. మనకొచ్చే తలనొప్పి, జ్వరం మొదలుకొని బిపి, షుగర్, ఆఖరికి కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా నయం చేసే శక్తి ఈ చికిత్సకు ఉందిట.

ఇంతకీ ఈ చికిత్సా విధానం ఏంటా అని అనుకుంటున్నారా. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా అలవాటయితే ఇంతేనా అనిపిస్తుంది ఎవరికైనా. నీళ్ళతో రోగాలను దూరం చేసుకోవటానికి మనం చెయ్యాల్సిందల్లా ఉదయం నిద్ర లేవగానే (నోరు కూడా కడుక్కోకుండా) 5 నుంచి 6 గ్లాసుల నీళ్ళు అంటే 1 1/2 లీటర్ల నీళ్ళు తాగటమే. దీనినే మన పూర్వికులు ఉషః పాన చికిత్స అనేవారు.

 

 

ఈ చికిత్స మొదలుపెట్టిన వాళ్ళు ముందు రోజు రాత్రి ఎలాంటి మత్తు పానీయాలు సేవించకూడదట. అలాగే ఈ నీళ్ళు తాగటానికి గంట ముందు, నీళ్ళు తాగాక గంట తరవాత ఏమి తినకూడదు. కనీసం కాఫీ, టీ లాంటివి కూడా పుచ్చుకోకూడదు.

మొదట్లో ఒకేసారి 5, 6 గ్లాసుల నెలలు తాగటానికి అలవాటు లేక ఇబ్బందిగా ఉండచ్చు. అందుకని ఇది మొదలుపెట్టిన మొదటి కొన్ని రోజులు ముందు 3,4 గ్లాసుల నీరు తాగి కాస్త గ్యాప్ ఇచ్చిమళ్లీ ఇంకో రెండు గ్లాసుల నీరు  తాగచ్చు. ఈ విధానంలో గంటలో మూడు నాలుగు సార్లు బాత్రూంకి వెళ్ళాల్సి వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు. శరీరానికి అలవాటు అయ్యాకా ఇలాంటి ఇబ్బందులు కూడా దూరమవుతాయి.

కేవలం ఇలాంటి చికిత్స వల్ల మాత్రమే కాదు, శరీరం అలసటగా ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేసినా కూడా మనకి తెలియని బలం వస్తుంది. అందుకే స్నానం చేయగానే హుషారుగా ఉంటారు చాలామంది. అలాగే స్విమ్మింగ్ మనిషిలో ఉండే కొవ్వుని కరిగిస్తుంది. ఆకలిని పెంచుతుంది.శరీరానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. ఇన్ని విధాలుగా మనని రక్షిస్తున్న నీటికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. దానిని వృధా చేయకుండా ఉంటే అంత కన్నా మించిన మేలు ఇంకోటి ఉండదు.  


...కళ్యాణి