|
Karthika Masam Splecial page
|
|
|
|
|
స్వయం 'వరం' |
అలానే నీ కూతురు స్వయంవరానికి తప్పకుండా వస్తానని రాజును, రామాదేవినీ ఆశీర్వదించి అక్కడినుంచి సరాసరి వైకుంఠానికి వస్తాడు నారదు. హాయిగా శ్రీదేవి పాదాలు వత్తుతుంటే, మెత్తనైన శేషతల్పంపై శయన భంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువుని దర్శించి భక్తి మనస్కుడై నమస్కరిస్తాడు. మునీంద్రుని చూసిన శ్రీహరి ఉచితరీతిన సత్కరించి కుశలప్రశ్నలు అడిగిన అనంతరం నారదుడు ఇలా అంటాడు – |
 |
‘’స్వామీ! లోకంలో నిన్ను బోలిన అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ అందమైన జీవితాన్ని గడుపుతున్నావు.భార్యవల్ల కలిగే సుఖం ముందు ఇంకే సుఖమైనా తృణప్రాయమే అంటారు.
విశాలమైన ఆ సభామంటపమంతా వివిధ దేశాధీశులతోనూ, రాకుమారులతోనూ నిండి ఉంది. అయితే అక్కడ కూర్చున్న వారి నేత్రాలు మాత్రం అపరంజిబొమ్మను, అందాలరాశిని ఎప్పుడెప్పుడు సందర్శిద్దామా అన్న ఆకాంక్షతో వేగిపోతున్నాయి.
ఇక నారదుడైతే చెప్పనవసరమే లేదు. ఆ రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టూ, ఆమెతో తాను స్వర్గసుఖాలు అనుభవిస్తున్నట్టు ఊహాలోకంలో తెలిపోతుంటాడు. అలా ఎవరి ఊహల్లో వారు తన్మయులై ఉన్న వేళ ... ఒక్కసారి కళ్యాణపురాధీశుడు మండపాన్ని చేరుకోవడంతో వారి ఊహాలోకానికి తెరపడ్డట్లయింది. ఆస్థాన పురోహితుడు వేదమంత్రాలు చదువుతుంటే, శ్రావ్యమైన రీతిలో మంగళతూర్యారావాలు మిన్నంటి మోగుతుంటే, చేతిలో పూలమాల పట్టుకుని అందమైన మేలిముసుగులో అనేకమంది చెలికత్తెలు వెంటరాగా, సౌకుమార్యంగా నడుచుకుంటూ సభామండపాన్ని చేరుకుంది విరికొమ్మ, పూరెమ్మ అయిన రమాదేవి.
ఆమె ఇక్కడకు రాకముందే ఆమె గురించి ఎన్నో కలలుగన్న రాజులంతా ఇక ఆమెను చూసేసరికి మరింత ఆశలు పెంచుకున్నారు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలన్న ధృడనిశ్చయానికి వచ్చేస్తారు.
స్వయంవరానికి వచ్చిన వారిని ఉద్దేశించి కళ్యాణపురాధీశుడు ఇలా ప్రకటిస్తాడు. ‘’అయ్యా! ఎక్కడెక్కడినుండో ఈ స్వయంవరం కోసం ఇక్కడకు ఏతెంచిన మీ అందరికూ నా అభినందనలు. నా కూతురైన రమాదేవి స్వయంవరానికి ఇంతమంది హాజరుకావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీలో ఏ ఒక్కరి గళసీమలోనో నా కూతురు వరమాలను వేస్తుంది. ఆ భాగ్యశాలే నాకు అల్లుడవుతాడు’’ అని చెప్పి వెంటనే కూతురివైపు చూసి ఇలా అంటాడు.
‘’తల్లీ! ఇంతమంది రాజన్యులలో నీకు నచ్చిన వరుడెవరో తేల్చుకునే శుభతరుణం ఇది. ఆలస్యమైనా ఆలోచించుకుని మరీ నీ భాగస్వామిని ఎంచుకో’’మ్మంటూ ఆదేశిస్తాడు తండ్రి. తండ్రి మాటకోసమే ఎదురుచూస్తున్న ఆ పూబోణి అప్పటికే తాను ఎవర్ని కట్టుకోవాలో మనసులో గట్టిగా నిర్ణయించుకోవడంతో అంతే స్థిరంగా రాకుమారులవైపు అడుగుల్ని కదిపింది. అయితే ఆమె కళ్ళు మాత్రం ఆమె మనోహరుడి కోసం వెతుకులాట ప్రారంభించాయి. |
|
|
|
|
|