|
Karthika Masam Splecial page
|
|
|
|
|
విష్ణు బ్రహ్మల ఆవిర్భావం |
చతుర్భుజాలతోనూ, సుందర వదనంతోనూ, తామరపూవ్వుల్లాంటి నేత్రద్వయంతోనూ, నీలిరంగు మేనితోనూ ఆయుధపాణియై పరమేశ్వరుని ముందు నిలిచిన ఆ తేజోవంతుడు చూపరులకు నయనానందాన్ని కలిగిస్తున్నాడు. మహేశ్వర సంకల్పంతోనే ఆ మహాపురుషుడు ఆవిర్భవించాడన్న మాట. అంతలోనే ఈ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిణి కూడా అవతరింపచేస్తాడు పరమశివుడు. వీరిద్దరి జంటా ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులకు కన్నుల పంట కలిగించింది.ఆ మహాపురుషుడిని చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాల్ని, పట్టుపీతాంబరాలని ప్రసాదిస్తాడు మహేశ్వరుడు. వాటిని ధరించిన ఈ తోజేవంతుడు మరింత శోభాయమానంగా కనిపిస్తాడు, అలా కనిపించే ఆ ఉత్తమ పురుషుడిని చూస్తూ మహేశుడు ఇలా అంటాడు |
 |
‘’పీతావసనాన్ని ధరించడంతో నిన్ను పీతాంబరధారుడని, మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుడవని, విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని, అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడవు కాబట్టి పురుషోత్తముడని వ్యవహరిస్తా’’రాని చెబుతాడు. ‘’ఇవేకాక అనేక పేర్లతో కూడా పూజింపబడతావని తెలియచేస్తూ ‘నమశ్శివాయ’ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండు, ఈ సృష్టిలో ముందు ముందు నీవు అత్యంత ప్రధానపాత్ర వహిస్తా’వని అక్కడి నుండి శివపార్వతులు అంతర్థానమైపోతారు.
మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోతాడు. ఇంతలో ఆయనకు ఒక వాటపత్రం కనిపిస్తుంది. ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలాకోన్నాళ్ళు, కొన్నేళ్ళు గడిచిపోతాయి. ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి ఒక వాణి వినిపిస్తుంది ‘’నీవు సకల జ్ఞానస్వరూపుడవు అందులోనూ నీటిలోనే వసించేవాడివి కాబట్టి నీవు నారాయణుడని కీర్తింపబడతావు. నారము అంటే జ్ఞానమనీ, నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణుడనే నామం సార్థకం అవుతు౦ది’’ అన్న శబ్దం వినిపిస్తుంది.
దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాలలోని సారం కూడా అవగతమై పోతుంది. ఇక అప్పటినుంచి సృష్టిని ఎలా ఉద్భవింపచెయ్యాలి? ఇందుకు ఎవరెవరు అవసరం అవుతారు? ఇత్యాది విషయాల్ని ఆలోచిస్తూ నమశ్శివాయ మంత్రాన్ని జపించడం మాత్రం వదిలిపెట్టడు. త్రిగుణాలైన సత్వం రాజోస్తామోగుణాలు కలిగినదే ప్రకృతి. ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి. వీటివల్లే పంచన్మాత్రలు (శబ్దము, స్పర్శ, రూపం, రసము, గంధము) పుడతాయి. వీటివల్ల పంచభూతాలు (భూమి. జాలం, అగ్ని, వాయువు, ఆకాశం) ఉద్భవిస్తాయి. అలాగే, జ్ఞానేంద్రియాలు (త్వక్కు, చక్షు, శ్రోత్రం, జిహ్వ, ఆఘ్రణం), కర్మేంద్రియాలు (వాక్కు, పాణి, పాదం, వాయువు, ఉపస్థ), అంతఃకరణాలు (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం) జనిస్తాయి. ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని నాభిప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది. దాని ఆది ఎక్కడో, అంతం ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుందా పుష్పం.
ఆ పుష్పంపైనే బ్రహ్మసరస్వతులు ఆసీనులై ఉంటారు. బ్రహ్మదేవుడి శరీరం ఎరుపుకాంతిలో ఉంటుంది. తమోగుణ ప్రదానుడై ఉంటాడు. జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పద్మంపై ఉండడంతో కిందిభాగం కూడా కనిపించలేదు. దాంతో ఈయన పుట్టుకకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మ కళ్ళకు ద్యోతకం కాలేదు. ఇంతకు తానెలా పుట్టింది తెలియక ఈ విషయమై ఎంతోకాలం ఆలోచిస్తాడు. ఈ ఆలోచనలోనే ఎంతో కాలం గడిచిపోతుంది. |
|
|
|
|
|