|
Karthika Masam Splecial page
|
|
|
|
|
మహాశివుని ఆవిర్భావం |
మునిసత్తములారా! శివుని మాయ తెలుసుకోవడం, ఇంద్రాదిదేవతలు, అజుడు, విష్ణువు తదితర దేవతాప్రముఖులకే సాధ్యం కాదు. అటువంటిది సామాన్యులమైన వారికి ఎలా సాధ్యం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా అడుగైనా ముందుకు కదలదు. ఆయన కరుణిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానంలో ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులం కావాలి’’ అంటూ శివతత్త్వాన్ని మరింత వివరంగా తెలియచేస్తాడు సూతుడు. అనంతరం న౦దీశ్వరుడు మార్కండేయునికి చెప్పిన మరో ఆసక్తికరఘట్టాన్ని వినిపించేందుకు ఉపక్రమిస్తాడు. |
 |
సృష్టికి పూర్వం అంతా జలమయమే. ఎక్కడ చుసినా (అసలు చూసేందుకు ఎవ్వరూ ఉండేవారే కాదు) నీరు తప్ప ఏదీ లేదు. అటువంటి మహాజలంనుంచే ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది. ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు.
అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలని భావిస్తాడు. అతనికాతలుపు రావడం ఏమిటి ఆయన ఎడమభాగంనుంచి ప్రక్రుతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రభవిస్తుంది. ఆమే పరాశక్తి, పరాదేవత, జగన్మాత. ఈ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి సాధ్యం కాదు. మహాశివునికి మాదిరిగానే మహేశ్వరి కూడా మూడు కన్నులతోటి ప్రభవించింది. అంతేనా! రెండు వేల చేతులు, ప్రళయాకారంతో కనిపించినా, క్షణంలోనే ప్రణయస్వరూపిణిగా మారిపోగలదు. ఈ తల్లే సకలచరాచర సృష్టికి మూలంగా చెబుతారు.
ఇలా ఆదిశక్తిని ప్రభవింపచేసి ఆమెతో విహారానికి బయలుదేరుతాడు పరమశివుడు. వారిద్దరూ సంతోషంగా ప్రణయసల్లాపాలతో మునిగి తేలుతుండగా, ఒక మహాపురుషుడు వీరిమధ్య నిలుస్తాడు. అతని రూపం తేజోమయమై ఉంది. |
|
|
|
|
|