|
Karthika Masam Splecial page
|
|
|
|
మహా లింగోద్భవం |
అయినా బ్రహ్మకు సరైన సమాధానం లభించదు. తన పుట్టుకకు కారణమైన వారెవ్వరూ అతనికి కనిపించరు. దాంతో నేను పద్మోద్భవుడిని, నా పుట్టుకకు నేనే కారణమన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. అసలే తమోగుణంతో ఉన్నవాడేమో ఆ భావం అతనిలో అహంకారాన్ని జనింపచేస్తుంది. అయినా అసలు ఈ పద్మం ఆద్యంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని బయలుదేరతాడు. ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు నిరాశేనే మిగిలిస్తుంది. దాంతో ఉస్సురంటూ దిగులు పడుతుండగా ఇతనికి కూడా అశరీరవాణి వాణి వినిపిస్తుంది. ‘’నాయనా! విషయం బోధపడాలంటే నీవు ప్రణవశబ్దమైన ఓంకారాన్ని జపించు. తప్పక నీకు మార్గం లభిస్తుంది అని చెబుతుంది అశరీరవాణి. |
 |
అంతే! అశరీరవాణి చెప్పిన విధంగా బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవితో కూడి ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షం అవుతారు.
అయితే బ్రహ్మదేవుడికి తాను పుట్టినప్పటినుంచీ ఇంతవరకూ ఏ రూపమూ కనిపించకపోవడంతో తనముందు ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుల్ని గుర్తు పట్టడు. దాంతో ‘’ఎవ్వరు మీరం’టూ ఎదురు ప్రశ్నిస్తాడు.
దానికి మహావిష్ణువు ‘’ఈ సృష్టిని జని౦పచేసేందుకు సాయంగా నిన్ను నేను అవతరింపచేశాను. నువ్వు నా నాభినుండి పద్మంపై ఉద్భవించావు’ ‘అని చెబుతాడు.
తామసగుణం ఆవరించి ఉన్న బ్రహ్మ అందుకు అంగీకరింపక ‘’చాల్లే! నీ వల్ల నేను ఆవిర్భవించడం ఏమిటి? నాకు నేనే స్వయంగా జన్మించాను. నా జన్మకు కారకులంటూ ఎవ్వరూ లేరు’’ అన్నాడు అహంకారంతో, అందుకు విష్ణువు నవ్వుతూ ‘’నువ్వు పోరపడుతున్నావు, నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించేందుకు నీ వద్దకు వచ్చాను’’ అన్నాడు విష్ణుమూర్తి. అందుకు ససేమిరా అంగీకరించడు బ్రహ్మ. దాంతో ‘’సరే! నీతో నాకు వాదం ఎందుకు? మన జన్మకారడుకైన పరమేశ్వరున్నే ధ్యానించి ఆయన్ను ప్రసన్నం చేసుకుందాం. ఆయనే వచ్చి అసలు నిజం నీకు విశదపరుస్తాడు’’ అన్నాడు. బ్రహ్మకీ సలహా నచ్చడంతో ఇద్దరూ పరమేశ్వరుణ్ణి నమశ్శివాయ మంత్రంతో ధ్యానం చేస్తారు. దాంతో ....
పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరి ముందు సాక్షాత్కరిస్తాడు. అత్యంత ఉన్నత ప్రమాణంలోనూ, అత్యద్భుతమైన ప్రకాశావంతంగాను ఉన్న ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు ఆ లింగానికి మొదలు ఎక్కడో, తుది ఎక్కడ ఉందో కూడా వారికి అవగతం కాదు. దాంతో వీటిని కనుగొన్న వారే మన ఇద్దరిలో గోప్పవారన్న నిర్ణయానికి వస్తారు బ్రహ్మవిష్ణువులు. అంతే! ఆ అభిప్రాయానికి ఎప్పుడైతే వస్తారో ఇద్దరూ ఒకరు పాతాళానికి, ,మరొకరు ఊర్ద్వలోకానికి పయనం సాగిస్తారు. విష్ణుమూర్తి యజ్ఞవరాహరూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ మొదలుపెడితే, బ్రహ్మదేవుడు హంస ఆకారంలో గగన మార్గంవైపు బయలుదేరతాడు., ఇలా వీరిద్దరూ దాదాపు కొన్ని వేల ఏళ్ళు ఈ అన్వేషణ సాగిస్తారు. అయినప్పటికీ వీరిద్దరికీ ఆ మహాలింగంయొక్క తుది, మొదలు కనుపించవు. అప్పటికే ఇద్దరూ వెతికి వెతికి అలసిపోతారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకచోట కలుసుకుంటారు. ఒకరినొకరు చూపులతోనే ఓదార్చుకుంటారు. అలా కొద్దిసేపు విశ్రమించిన అనంతరం బ్రహ్మతో విష్ణువు ఇలా అంటాడు. |
|
|
|
|
|