|
Karthika Masam Splecial page
|
|
|
|
|
కలగా మిగిలిన కళ్యాణం |
అంతే! సభామండంపంలో ఉన్న వారి వీనులకు లయబద్ధమైన సందడి వినిపిస్తుంది. అది ఆ రాకుమారి నడుస్తున్నప్పుడు ఆమె కాలి అందియలు మోగుతుంటే జనించిన సవ్వడో, లేదా ఆమె వస్తున్నదన్న ఆనంద పారవశ్యంతో తమ గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నప్పుడు జనించే ధ్వనో వాళ్ళకు అర్థం కాలేదు. ఇక నారదునికైతే రమాదేవి ఆమె తండ్రి ఆనతి మేరకు తనవైపు కదలిరావడం ఒక్కటే కనిపించింది. అతని మనస్సంతా ఊహాప్రపంచంలో తేలి యాడిపోతోంది .... |
 |
ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుడు దగ్గరకే వస్తుంది. రావడమేమిటి? ఆ చేతిలోని (వ)విరిమాలను ఏమాత్రం ఆలోచించకుండా అతని మెడలో వేసెయ్యడమేమిటి అంతా క్షణంలో జరిగిపోతుంది. పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కరకమలాన్ని తన చేతిలోకి తీసుకుని వెంట తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తాడు నారదుడు. ఇంతలో ‘’వదులు ... వదులు’’ అన్న పెనుగులాటతో నారదుడు బాహ్యస్మృతిలోకి వస్తాడు ...!!
అప్పటికే రాజులందరితోపాటు వారి మధ్యలో కోటి సూర్యప్రభాసమానుడై వెలుగొందుతున్న శ్రీమహావిష్ణువును రమాదేవి చూడడం, పులకించిన మదితో తన హృదయనాథుడైన శ్రీహరి గళసీమలో పుష్పమాలను అలంకరించడం జరిగిపోయింది. వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడునిపైన ఈమెను ఎక్కించుకుని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ నారదుడు పట్టుకుని తీసుకుపోయేందుకు ప్రయత్నించిన తన పక్కనే ఉన్న రాకుమారుడిని వదలమని కేకలు వేసింది అతనే. ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా పకపకామని నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వుతో నారదుడు తాను చేసినదేమిటో గ్రహించి సిగ్గుపడి తలవంచుకుంటాడు. అయినప్పటికీ రాజులు నవ్వు ఆపక పోవడంతో ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నిస్తాడు.
‘’నీ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తున్నప్పటికీ ముఖం మాత్రం ఎలుగుబంటి, కోతిలా ప్రతిఫలిస్తోంది. అటువంటి నిన్ను చూసినవ్వక ఏం చెయ్యమంటావు?’’ అని ఎదురు ప్రశ్నిస్తారు వారంతా. అంతే! తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చెయ్యాలో తెలియక, తోకతొక్కిన తాచులా కూర్చున్న చోటునుంచి సర్రున లేచి అక్కడినుంచి కోపంతో వైకుంఠానికి బయల్దేరి వస్తాడు.
అక్కడ రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే నారదుడి కోపం నషాళానికి అంటుతుంది. ఇక వేరే ఏమీ ఆలోచించకుండా ఉక్రోషం, ఉద్వేగంతో ఊగిపోతూ గద్గదస్వరంతో ఇలా శపిస్తాడు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|
|