|
Karthika Masam Splecial page
|
|
|
|
|
తొలగిన మాయ పరదా |
‘’నాకింత ద్రోహం చేస్తావా? దేవుడవని నిన్ను నమ్మి వరం అడిగితే ఇంతమోసం చేస్తావా? నాలాటి జడధారిని మోసగించిన నీవు ఇంతకింత ఫలితం అనుభవించక మానవు. నన్ను ఏ విధంగా అయితే భార్యసుఖం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించావో నీవూ అలానే భార్యను విడిచి బాధపడతావు’ ‘అంటూ శపిస్తాడు. అంతేకాదు! ‘’నన్ను ఏ రూపంలోనైతే అక్కడ కనిపించేలా చేశావో ఆ వానరాలు, ఎలుగుబంట్ల సాయంతోనే మళ్ళీ నీ భార్యను కలిసి సుఖిస్తావు’’ అంటూ తన శాపానికి విమోచనం కూడా నారదుడే తెలియచేస్తాడు. |
 |
ఇదంతా విని కూడా మహావిష్ణువు శాంతచిత్తుడై, అంతకంటే శాంతస్వరంతో ‘’నారదా! ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీవిప్పుడు వట్టి నారడుడివి కాదు. శివమాయ నిన్ను పూర్తిగా కమ్మేసింది. కాబట్టే ఎవరు ఎవరో తెలియని స్థితిలో నువ్వు మాట్లాడుతున్నావు. నీకున్న జ్ఞానమంతా నశించి మోహాంధకారంలో పడి వేగిపోతున్నావు.
ఇలాంటి స్థితిలోనే నీకు రమాదేవి కనిపించడం, ఆమెను మోహించడం జరిగింది. ఇప్పుడామె నీకు దక్కకుండా పోయిందన్న కోపంతో దానికి నేనే కారణమంటూ అకారణమైన నిందలు వేసి నన్ను శపించావు. అయినా నీ మీద నాకు కోపం రావడం లేదు. నీ శాపాన్ని నేను ఆనందంగా అనుభవిస్తాను. త్రేతాయుగంలో మానవుడిగా జన్మించి దుష్టసంహారం చేసేందుకు నీ శాపం నాకు వరంగా పరిణమిస్తుంది’’ అంటాడు.
ఆయన శాంతస్వరాన్ని రూపాన్ని చూసిన నారదుడుకి జ్ఞానోదయం అవుతుంది. తత్ క్షణమే నారదుడు ‘’వైకుంఠవాసా! పరంధామా!’’ అంటూ పాదాలపై పడిపోతాడు, అతడిని తన మృదువైన హస్తాలతో మెల్లగా పైకి లేవనెత్తి ‘’నారదా! శివమాయ జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయన ఎవ్వరికీ అందని మహిమాన్వితుడు. అలాంటి మహానుభావుడిని చులకనగా చూశావు. అందుకే అలా జరిగింది’’ అంటాడు.
‘’నిజమే స్వామీ! నా తప్పులు మన్నించు. ఎప్పుడూ ...
పావనమౌ నీ పదములు
నేవేళను గొల్చు భాగ్యమిప్పించు ప్రభూ!
జీవన చదరంగంలో
పావును కానీకు నన్ను పావనచారితా!!
అంటూ దీనంగా ప్రార్థిస్తాడని శివమాయ యొక్క గొప్పతనాన్ని నందీశ్వరుడు మార్కండేయునికి వివరించగా, ఈ విషయాన్ని శౌనకాది మహర్షులకు సూతపౌరాణికుడు తెలియచేస్తాడు.
|
|
|
|
|
|