పన్నెండు తావులు -పన్నెండురూపాలు
పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు.అన్ని తెలసి ఉంటాడు .అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ )కనిపిస్తాడు .ఆయనే సాంబమూర్తి .
రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది .దానిని 'ఆరూపం 'అంటారు .అదే శివలిగం .
మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు .దాని మొదలు .తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు
కూడా భంగపడ్డారు .ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో !అదే శివరాత్రి అయింది .ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవ
కాలం అంటారు .జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల
తాను వ్యాపించి ఉంటానని ,ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు.అవే ద్వాదశజ్యోతిర్లింగాలు.
ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా.ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము ,ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.
అయిదు రకాల లింగాలు
శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో మొదటిది స్వయంభులింగం ,అంటే తనంతట తానుగా అవతరించింది .రెండోవది
బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.నాలుగోవది
చరలింగం .దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .అయిదోవది గురులింగం .శివుని విగ్రహమే గురులింగం.
ఆరు రకాల ద్రవ్యాలు
అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం ,దేవశిల్పి అయిన
విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు .ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు .అవి:రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు ,రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు
చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు ,మట్టితో చేసేవి మృత్తికాలింగాలు,అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి
క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు.
ఎవరు ఏ లింగాలని పూజించాలి
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి .స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు.స్త్రి విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని
,భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల
వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.
ఏలింగాన్ని పూజ ఏ ఫలితం?
ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది .ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦
,వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది .ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది .మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుం ది.కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది .అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం ,మధ్యమం లోహ లింగం .
అతి పవిత్ర బాణలింగం
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు .ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి .ఇవి తెల్లాగా ,చిన్నగా
అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి .
రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది .వైశాఖంలో వజ్రలింగాన్ని
,జ్యేష్ట౦లోమరకత లింగాన్ని,శ్రావణంలో నిలపు లింగాన్ని ,భద్రపదంలో పద్మరాగ లింగాన్ని ,ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని ,కర్తికంలో ప్రవాళలింగాన్ని ,మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని ,మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని ,ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి .వీటికి ప్రత్యామ్నాయంగా వెండి ,రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
స్తావర,జంగమ లింగాలు
జగత్తంతా శివమయం ,అంటే లింగమయమే .బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు ,సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు
సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి )జంగమాలు(కదిలేవి -మనుషులు.జంతువులు,పక్షులు ,క్రిమికీటకాలు మొదలైనవి )కూడాలింగ రూపాలే అవుతాయి .వీటికి స్తావర లింగాలు అంటారు .వీటిని పూజించడం ,సేవిచడం కూడా
శివపుజలోకే వస్తుంది .
లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం ,మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది. |