కళ్ల కింది వలయాలు కనబడవిక!

కళ్ల కింది వలయాలు కనబడవిక!

 

 

కళ్ల కింద నల్లని వలయాలు... కొన్ని రకాల శారీరక సమస్యలు, నిద్ర లేమి, మానసిక ఆందోళన, ఒత్తిడి, ధూమపానం మద్యపానం లాంటి చెడు అలవాట్లు... ఇలా రకరకాల కారణాల వల్ల ఇవి వస్తాయి. కారణం ఏదైనా ఒక్కసారి వచ్చాయంటే మాత్రం మన అందానికి మచ్చలా అనిపిస్తాయి. మనల్ని పేషెంట్ లా కనిపించేట్టు చేస్తాయి. అందుకే వీటిని వెంటనే పోగొట్టుకోవాలి. దానికి ఈ చిట్కాలు బాగా పనికొస్తాయి.

- బంగాళాదుంప రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీనిలో దూదిని ముంచి నల్ల వలయాలు ఉన్నచోట కాసేపు రుద్ది కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే వలయాలు వేగంగా మాయమవుతాయి.

- పుదీనా ఆకుల్ని పేస్ట్ చేసి, దాన్ని కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

- కళ్ల చుట్టూ తేనెను రాసి, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా ఫలితముంటుంది. 

- ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని చుక్కల వెనిగర్ వేసి కలపాలి. మునివేళ్లను ఈ రసంలో ముంచి, కళ్ల చుట్టూ మెల్లగా మర్దనా చేయాలి. పది నిమిషాల పాటు అలా చేసిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే రెండు మూడు వారాల్లో సమస్య తొలగిపోతుంది.

- టొమాటోను గుజ్జులా చేసి... ఇందులో నిమ్మరసం, కొద్దిగా శెనగపిండి కలపాలి. దీనితో కళ్ల చుట్టూ ప్యాక్ వేసుకుని, పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

- రోజూ పడుకునేముందు ఆలివ్ ఆయిల్ తో డార్క్ సర్కిల్స్ ఉన్నచోట మసాజ్ చేసి రాత్రంతా వదిలేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే కొద్ది రోజుల్లో సర్కిల్స్ పోతాయి.

- టీ బ్యాగ్ ని కాసేపు ఫ్రిజ్ లో పెట్టండి. చల్లబడిన తరువాత తీసి కళ్లపై పెట్టుకోండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కూడా సమస్య పరిష్కారమవుతుంది.


-Sameera