త్రిష చేసిన నేరమేమి??
on Apr 13, 2015
త్రిష ఇప్పుడు ఇరకాటంలో పడింది. తమిళనాట ప్రజా సంఘాలు ఆమెపై నిప్పులు చెరుగుతున్నాయి. త్రిష చేసింది ముమ్మాటికీ తప్పే, అది జాతి ద్రోహం అంటూ ఆమెను నిందిస్తున్నాయి. ఇంతకీ త్రిష చేసిన ఘోరం ఏంటంటే.. ఆమె లయన్ ఆడియో వేడుకకకు హాజరవ్వడమే. లయన్ పాటల వేడుకకు వెళ్లడం అంత పెద్ద తప్పా..? అనుకొంటున్నారా. తమిళ తంబీల దృష్టిలో అంతే. తమిళనాడులోని ప్రజా సంఘాలకు ఇప్పుడు ఏపీ అన్నా.. చంద్రబాబు అన్నా పడడం లేదు. కారణం.. ఇటీవల ఎర్ర చందనం కూలీలపై జరిపిన ఎన్‌కౌంటర్. తమిళ తంబీలను ఎన్‌కౌంటర్ పేరుతో అనవసరంగా కాల్చి చంపారని వాళ్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ వేడుకలో నువ్వెలా పాలుపంచుకొంటావ్?? నీకు రాష్ట్ర్రాభిమానం లేదా? అంటూ ప్రజా సంఘాలు త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై త్రిష వివరణ ఇచ్చుకొంది కూడా. అది నా సినిమా కాబట్టి వెళ్లా.. ప్రమోషన్లో భాగం పంచుకోవడం నా బాధ్యత.. అంటూ బదులిచ్చింది. కానీ.. తమిళ తంబీల ఆగ్రహం చల్లారడం లేదు. పాపం.. లయన్ పాటల వేడుకకు హాజరవ్వడమే త్రిష చేసిన నేరమైపోయింది. ఏం చేస్తాం..?? బ్యాడ్ లక్.