రవితేజ, బ్రహ్మానందం మధ్యలో విలన్
on Jul 30, 2015
మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందం రామోజీ ఫిల్మ్ సిటీలో విలన్ లతో ఆటాడుకుంటున్నారు. వీరిద్దరి కలిస్తే చేసే హంగామా ఎలా వుంటుందో, ఇది వరకే ఎన్నో సినిమాల్లో సినీ ప్రేక్షకులు చూసే వుంటారు. లేటెస్ట్ గా 'బెంగాల్ టైగర్' సినిమా కోసం కూడా వీరు విలన్ తో ఆడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ విషయం విలన్ కి తెలిసేసరికి వీరి వెంట పడ్డారట.
మన మాస్ మహారాజుకు వారిని వె౦టనే కొట్టేస్తే మజా వుండదు కదా. అందుకే వారందని తన చూట్టు ఫిల్మ్ సిటీ మొత్తం తిప్పుకొని, ఆతరువాత చితక్కోట్టాడట. ప్రస్తుత౦ బెంగాల్ టైగర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రవితేజ తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరాని ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
