బోయపాటి బన్నీ మొదలెట్టారు
on Jul 29, 2015
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ సినిమా షూటింగ్ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటు౦ది. చాలా రోజుల పాటు శ్రమించి ఈ సినిమా స్క్రిప్ట్ తీర్చిదిద్దాడు బోయపాటి శ్రీను. బద్రీనాథ్ తర్వాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. బోయపాటిపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి విలన్ గా మార్చబోతున్నాడు. ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకేక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన రకుల్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో బిజీగా వుంది. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి తో 50 కోట్ల మార్క్ ని అందుకున్న బన్నీ ఈ సినిమాతో హాట్రిక్ అందుకుంటాడా? లేదా అన్నది వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
