ప్రభాస్.. రానా.. డామినేషన్ ఎవరిది?
on Jul 6, 2015
రాజమౌళి సినిమాల్లో భయంకరమైన ప్రతినాయకుల్ని చూశాం. ఆయన సినిమాల్లో దాదాపుగా విలన్ల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు బాహుబలిలోనూ రానా ప్రభాస్‌ని డామినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. `బాహుబలి`లో ప్రభాస్ కంటే రానాకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని, రానా ప్రభాస్‌ని అన్నివిధాలా డామినేట్ చేశారని చెప్పుకొంటున్నారు. దానికి తోడు ప్రచార చిత్రాల్లోనూ ప్రభాస్ కంటే రానానేఎక్కువ చూపిస్తున్నారు.
ఇదే విషయాన్ని ప్రభాస్‌ని అడిగితే.. `ట్రైలర్‌లో నన్ను కూడా బాగానే చూపించారు కదా, మీకు అలా అనిపిస్తోందా`` అంటూ లైట్ తీసుకొన్నాడు. మరోవైపు రానా మాత్రం `ఇప్పటి వరకూ ఇండియన్ స్ర్కీన్‌పై ఎవ్వరూ చూడని విలన్‌ని మీరు భళ్లాలదేవలో చూస్తారు. రాజమౌళి సృష్టించిన విలన్లలో అతి శక్తిమంతుడు భళ్లాలదేవనే` అంటున్నాడు. దీన్ని బట్టి రానా ఆధిప్యతం ఈ సినిమాలో ఎంత వరకూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా విషయంలో డి. సురేష్ బాబు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొన్నాడు. బాహుబలిలో సురేష్ బాబు భాగస్వామ్యమూ ఉందన్నది విశ్వసనీయ వర్గాల టాక్. అందుకే రానాని ఈ సినిమాలో బాగా ప్రమోట్ చేశాడట రాజమౌళి. ఈ విషయమే ప్రభాస్ అభిమానుల్ని కలవరానికి గురి చేస్తోంది. ఇది రానా సినిమానా? ప‌్రభాస్ సినిమానా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అనుమానాలు తీరాలంటే.. జులై 10 వరకూ ఆగాల్సిందే.