ఎన్టీఆర్ మళ్లీ ఖాకీ కడుతున్నాడోచ్..!
on Jul 14, 2015
టెంపర్‌లో ఎన్టీఆర్ పోలీస్ డ్రస్సులో తన విశ్వరూపం చూపించాడు. బాద్ షాలో కొన్ని సెకన్ల పాటు పోలీస్‌గా కనిపించి, తన ముచ్చట తీర్చుకొన్న ఎన్టీర్.. పూర్తిస్థాయిలో పోలీస్ అవతారంలో దర్శనమిచ్చింది మాత్రం టెంపర్‌లోనే. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యూనిఫామ్ వేయబోతున్నాడు ఎన్టీఆర్.
సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' అనే చిత్రం ఇటీవలే లండన్‌లో మొదలైంది. ఇందులోనూ తారక్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. పోలీస్ అంటే అట్టాంటిట్టాంటి పోలీస్ కాదు.. ఎన్టీఆర్ ఓ ఇంటర్ పోల్ ఆఫీసరట. సీక్రెట్‌గా.. దొంగల్ని పట్టేసుకొంటుంటాడట. బాద్‌షా, టెంపర్.. ఇవి రెండూ ఎన్టీఆర్‌కి మంచి విజయాల్ని అందించిపెట్టాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ సినిమా కూడా కొనసాగిస్తే.. పోలీసు పాత్రలకు తారక్ కేరాఫ్ అడ్రస్సయిపోవడం ఖాయం.