సమ్మూ-తమ్మూ మధ్యలో చైతూ
on Jun 25, 2015
అయితే సమంత లేదంటే తమన్నా....మరొకరు వద్దని భీష్మించుకు కూర్చున్నాడట నాగ్ పుత్రరత్నం. అమ్మో...మీరు అప్పుడే తప్పుగా అర్తం చేసుకోకండి. మేం చెబుతున్నది చైతు సరసన హీరోయిన్ గా. నాగచైతన్య కెరీర్లో హిట్టైన సినిమాలేమైనా ఉన్నాయంటే సమంత, తమన్నా హీరోయిన్స్ గా నటించినవి మాత్రమే అని చెప్పొచ్చు. అందుకే అదే సెటిమెంట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాడట చైతూ.
గతంలో తమన్నాతో నటించిన 100% లవ్, తడాఖా సూపర్ హిట్టయ్యాయి. దీంతో లేటెస్ట్ మూవీలో తమ్మూ కావాలని తెగ అల్లరి చేస్తున్నాడట. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా హడావుడిలో ఉన్న చైతూ...అది పూర్తయ్యాక చందు మొండేటి దర్శకత్వంలో నటించనున్నాడు. అందులో తమన్నా హీరోయిన్ అన్నమాట. ఇది సరేకానీ ఎప్పటికీ తమన్నా, సమంత కావాలంటే ఎలా? వాళ్లిద్దరూ ఫేడవుట్ అయిపోయాక చైతూ సినిమాలు చేయడం మానేస్తాడా? అయినా కథలో, హీరోలో విషయం ఉండాలి కానీ...ఇలా ఆమె కావాలి, ఈమె కావాలని దొంగాటేంటి చైతూ....థింక్ వన్స్ అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.