Home

»

Latest News

చైతూ.. తర్వాతి టీజర్‌కి ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో!

Feb 15, 2020 6:23PM

 

టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా శేఖర్ కమ్ములకు ఎలాంటి పేరుందో మనకు తెలిసిందే. సున్నిత హృదయుడిగా పేరున్న శేఖర్, దానికి తగ్గట్లే సున్నిత కథాంశాలతో, సున్నిత సన్నివేశాలతో సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆయన ఇప్పుడు 'లవ్ స్టోరి' అనే సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీని ఆయన చూపిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 'ఏయ్ పిల్లా పరుగున పోదామా..' అనే సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూకు అమిత ఆదరణ లభించింది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో చైతు, సాయిపల్లవి మధ్య కెమెస్ట్రీ చూడ ముచ్చటగా అనిపిస్తోంది. 

'ఫిదా'తో పల్లవిని టాలీవుడ్‌కు పరిచయం చేసిన శేఖర్.. ఇప్పుడు 'లవ్ స్టోరి'లో చైతూకు జోడీగా ఆమెతో మరోసారి మ్యాజిక్ చేయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో మెట్రో ట్రైన్‌లో చైతూను పల్లవి ముద్దాడగా, చైతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పవన్ సిహెచ్. స్వరాలు కూర్చిన ఈ పాటను చైతన్య పింగళి రాయగా, హరిచరణ్ అద్భుతంగా ఆలపించాడు. ఈ మ్యూజికల్ ప్రివ్యూ చూస్తుంటేనే.. ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది.

కాగా ఇది బంపర్ హిట్ కావడంతో చైతూ కూడా ఖుషీ అయిపోయాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్‌కు సినిమా సెట్స్ మీదే ఒక చిన్న కానుక ఇచ్చాడు. అది విలువైన నల్ల కళ్లద్దాలు! చైతూ తనకు ఆ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్న ఫొటోతో పాటు, ఆ కళ్లద్దాలను ధరించిన తన ఫొటోను కూడా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు శేఖర్. "నువ్వు చూపించిన ఈ ప్రేమకు థాంక్యూ చై. నన్ను టచ్ చేశావ్. తర్వాతి టీజర్‌కి ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో" అని ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 2న 'లవ్ స్టోరి' మన ముందుకు వస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com