నాగచైతన్య 'ప్రేమ కథ' వాయిదా పడలేదు!
on Mar 2, 2020
క్రియేటివ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సంగీత భరిత ప్రేమకథాచిత్రం 'లవ్ స్టోరీ'. తెలుగులో ఆ టైటిల్ మీనింగ్ 'ప్రేమ కథ'. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అసలు మేటర్ లోకి వస్తే... ఈ సినిమా విడుదల వాయిదా పడిందని నాలుగైదు రోజులుగా ఒక సెక్షన్ వెబ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ స్పందించింది. వాటిలో నిజం లేదని తెలిపింది.
నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ "లవ్ స్టోరీ సినిమా వాయిదా పడిందని వస్తున్న పుకార్లు లో ఎంత మాత్రం నిజం లేదు. త్వరలో సినిమా విడుదల తేదీన అధికారికంగా ప్రకటిస్తాం" అని అన్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. బహుశా... ఒక వారం అటు ఇటులో విడుదల కావచ్చు. జూన్ నెలకు వాయిదా పడిందని వార్తలు నిజం కాదని తేలింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
Also Read