టైటిలే కాదు... చైతు క్యారెక్టరూ పాత పద్ధతిలోనే?
on Feb 22, 2020

పరశురామ్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందనున్న చిత్రానికి లెజెండరీ యాక్టర్, చైతు తాతయ్య 'నాగేశ్వరరావు' టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్స్... ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదనుకోండి. ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా ఎవరూ 'నాగేశ్వరరావు' లాంటి పేర్లు పెట్టుకోవడం లేదు. ఓల్డ్ ఫీల్ ఉంటుందని. అటువంటి టైటిల్ సినిమాకు పెట్టాడు పరశురామ్. సినిమా టైటిలే కాదు... సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఓల్డ్ ఫీల్ టైపు పాత పద్ధతిలో సాగుతుందట. చిన్నతనంలో పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని, పాతకాలం పద్ధతిలో సాగే యువకుడిగా చైతు క్యారెక్టర్ ఉంటుందట.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కూడా బావుంటుందని టాక్. ప్రజెంట్ ఈ సినిమా డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేసే పనిలో పరశురామ్ బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తర్వాత షూటింగుకు వెళతారు. హీరోయిన్ గా రష్మిక మందాన పేరు పరిశీలనలో ఉంది. 'గీత గోవిందం'లో ఆమె నటన సినిమా విజయానికి ఓ కారణం అయింది. అందుకని, ఆమెను రిపీట్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు. మరోవైపు కీర్తి సురేష్ పేరునూ పరిశీలిస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



