చైతూ 'లవ్ స్టోరీ'కి 15 రోజులే బ్యాలన్స్
on May 2, 2020
దర్శకడు రాజమౌళికి జక్కన్న అని పేరు. అమరశిల్పి జక్కన్న శిల్పాన్ని చెక్కినట్టు సినిమాని చెక్కుతూ ఉంటారని ఆయనకు ఆ పేరు పెట్టేశారు. ఆమాటకు వస్తే శేఖర్ కమ్ముల కూడా జక్కన్నే. ఆయనకు కూడా సినిమాను అద్భుతంగా, తనకు నచ్చినట్టు వచ్చేవరకూ చెక్కుతారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' తీస్తున్నారు. నిజానికి, ఈ సినిమాను కొత్త హీరో హీరోయిన్లతో మొదలుపెట్టారు. సరిగా రావడం లేదని నాగచైతన్య, సాయి పల్లవిను తీసుకున్నారు.
'లవ్ స్టోరీ' సినిమాను చెక్కుతూ చెక్కుతూ నిర్మాతల జేబులు శేఖర్ కమ్ముల ఖాళీలు చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. ఎప్పటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందో తెలియదని గుసగుసలు వినిపించాయి. వీటికి నిర్మాతలు చెక్ పెట్టారు. ఇంకా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని నిర్మాతలు స్పష్టం చేశారు. నిజానికి, ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. ఈలోపు కరోనా కాటేసింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ పదిహేను రోజుల షూటింగ్ కంప్లీట్ చేసి, తర్వాత సరైన డేట్ చూసి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
