మహేష్ మరో సినిమా చేసుకోమన్నా... 'నో' అన్న దర్శకుడు
on Mar 4, 2020
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించడం వందకు రెండు వందల శాతం ఖాయమే. అయితే... ఈ సినిమా సీన్ లోకి రాకముందు అక్కినేని నాగ చైతన్య హీరోగా సినిమా చేయడానికి పరశురామ్ రెడీ అయ్యాడు. మహేష్ సినిమా రావడంతో చైతన్యతో చేయాల్సిన సినిమా పక్కన పెట్టాలని అనుకున్నాడు. ఈ లోపు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లోని 'ఆచార్య'లో ప్రత్యేక పాత్ర చేసే అవకాశం మహేష్ ముందుకు వచ్చింది. ఎంత లేదన్నా 30 రోజులు కేటాయించాలి. మే నెలాఖరు నుంచి ఆ సినిమాకు మహేష్ డేట్స్ ఇచ్చారు. రెండు సినిమాలు ఒకేసారి చేసే అలవాటు సూపర్ స్టార్ కి లేదు. అందుకని, చిరంజీవి సినిమా చేసిన తర్వాత పరశురామ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.
జూన్ వరకు దర్శకుడిని వెయిట్ చేయించడం ఇష్టం లేక... ఈలోపు మరో సినిమా చేసుకోమని చెప్పారట. నాగ చైతన్య సినిమా చేసుకోమని పరోక్షంగా చెప్పారు. అందుకు, పరశురామ్ నో చెప్పినట్టు టాక్. కథను మరింత పక్కగా రెడీ చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం అదే పని మీద ఉన్నాడట. ఓ పక్క ఈ పనులు జరుగుతున్నాయి. మరో పక్క ఈ సినిమా నిర్మాతలు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.