సమంతతోనే రొమాన్స్ చేస్తాడట!!
on Apr 18, 2015
టాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా సెంటి మెంట్ ను ఫాలో అవుతు౦టారు. ఒక దర్శకుడితో గానీ, హీరోయిన్ తో గానీ నటించి హిట్ కొట్టినప్పుడు మళ్లీ వారితోనే నటించేందుకు ఉత్సాహం చూపుతు౦టారు. లేటెస్ట్ గా మన ప్రిన్స్ మహేష్ బాబు కూడా హిట్ భామలే కావాలంటున్నాడట. 1 నేనొక్కడినే, ఆగడు వంటి ఫ్లాప్ లతో సతమతమైన మహేష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సెంటి మెంట్ ను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట. కొరటాల శివ శ్రీమంతుడు తరువాత శ్రీకాంత్ అడ్డాలతో చేయబోయే సినిమాలో సమంతనే రొమాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్ కావడంతో పాటు, వీరి జోడీ కూడా బాగా కుదిరిందని టాక్ వచ్చింది. అందుకే ఈ మూవీలో తన జోడిగా కాజలే కావాలని మహేష్ కోరినట్లు టాక్ వస్తోంది. మరి మూడోసారి మహేష్ కు హిట్ వరిస్తుందా.. ? అనేది చూడాలి.