'ఓకే బంగారం' చిరంజీవికి నచ్చలేదట!!
on Apr 18, 2015
'ఓకే బంగారం' సినిమా మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదట! అవును అయితే అది ఇప్పుడు కాదనుకొండీ..మణిరత్నం ఈ స్టొరీని రాసినప్పుడు చిరంజీవిని కలిసి వినిపించారట. ఈ సినిమాని రామ్ చరణ్ తో కలిసి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారట. అయితే ఇలాంటి లవ్ స్టోరీలు రామ్ చరణ్ కు వర్కవుట్ అవ్వవని ఆయన సున్నితంగా తిరస్కరించారట. దీంతో మణిరత్నం మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్ తో 'ఓకే బంగారం' తీసేసాడు. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజై సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. మణి ఇజ్ బ్యాక్ అని అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం కొంత నిరాశకు గురవుతున్నారు. రామ్ చరణ్ ఓ మంచి ఛాన్స్ మిస్ చేసున్నాడని, ఈ సినిమా చేసి వుంటే మెట్రో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేవాడని, అతని మార్కెట్ ఇంకా పెరిగివుండేదని అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా పరిశ్రమలో జరిగే విచిత్రాలే ఇవి..ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి అదృష్టాన్ని తెస్తుంటాయి.