మహేష్‌ని కావాలని తొక్కేశారా??
on Jun 1, 2016
బ్రహ్మోత్సవం సినిమా ఫ్యాన్స్‌కి సైతం నచ్చలేదు. ఇందులో విడ్డూరం ఏం లేదు. కథ, కథనాలు, పాత్రల తీరు గాడి తప్పడంతో సినిమా ఫట్ మంది. ఈ విషయంలో చిత్రబృందం కూడా ఏమీ బాధపడడం లేదు. తప్పు జరిగిపోయిందని వాళ్లకూ తెలుసు. కానీ జీర్ణించుకోలేకపోతున్న విషయం ఏమిటంటే.. ఈసినిమాపై పెరిగిపోయిన నెగిటీవ్ పబ్లిసిటీ. అసలు ఈ శతాబ్దంలో ఇంతటి చెత్త సినిమా రాలేదన్నట్టు ప్రచారం చేశారంతా. ట్విట్టర్‌లోనూ, ఫేస్ బుక్‌లోనూ ఇదే జోరు. ఆఖరికి ఓ ఇంగ్లీషు పత్రిక బ్రహ్మోత్సవాన్ని దుమ్మెత్తి పోసింది. ఈ సినిమాపై పుట్టిన పేరడీలూ, జోకులూ అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి మహేష్ బాబు డాన్స్ చేసిన విధానాన్ని కూడా వదల్లేదు. ఆగడులాంటి డిజాసర్ట్ ఇచ్చినా...ఇంత ఘోరమైన నెగిటీవ్ పబ్లిసిటీ రాలేదు. దాంతో చిత్రబృందం కూడా అసహానానికి గురైంది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అనేదానికంటే ఈ సినిమాపై ఇంత నెగిటీవ్ పబ్లిసిటీ ఎందుకొచ్చింది? అనేదానిపైనే తీవ్ర మధనం జరుపుతోంది చిత్రబృందం.
చివరికి ఇది కావాలని చేసిన పనే అని తేల్చిందట. మహేష్ అంటే గిట్టనివాళ్లే.. మీడియాలో నెగిటీవ్ ప్రచారానికి ఉసిగొల్పింది.. అన్న విషయంపై బ్రహ్మోత్సవం బృందానికి ఓ క్లారిటీ వచ్చింది. కొంతమంది నాన్ మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగిటీవ్ పబ్లిసిటీ ఓ ఉద్యమంలా నిర్వహించారని, కావాలని ఈ సినిమాని తొక్కేశారని బ్రహ్మోత్సవం టీమ్ ఓ క్లారిటీకి వచ్చింది. బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అయితే.. అదే సమయంలో థియేటర్లో ఆడుతున్న సరైనోడుకి ప్లస్. కాబట్టి కొంతమంది బన్నీ ఫ్యాన్స్ కూడా... నెగిటీవ్ పబ్లిసిటీని దగ్గరుండి ప్రోత్సహించార్ట. ఆ ప్రభావం సరైనోడు వసూళ్లపై చూపించింది కూడా. వసూళ్లు డ్రాప్ అవుతున్న దశలో... బ్రహ్మోత్సవం వచ్చింది. మహేష్ సినిమా ఎప్పుడు ఫ్లాప్ అయ్యిందని తెలిసిందో.. అప్పుడు సరైనోడు వసూళ్లూ పెరిగాయి. అలా.. కావాలనే.. బ్రహ్మోత్సవంని తొక్కేశారని.. మహేష్ ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.