ఆ డైరెక్టర్‌పై మండిపడ్డ మహేష్ ?
on Jul 29, 2015
మహేష్ బాబు ఎవరితో అయినా సరదాగా ఉంటాడు. అతని సెన్సార్ హ్యూమర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటుంటారు ఆయనతో పనిచేసేవాళ్లు. అయితే మహేష్‌కీ కోపం వస్తుందండోయ్. ఆ కోపం ఎలా ఉంటుందో, దర్శకుడు కొరటాల శివకు అర్థమైంది. ఈమధ్య కొరటాలపై మహేష్ సీరియస్ అయ్యాడని ఫిల్మ్‌నగర్ టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం.. శ్రీమంతుడు. ఆగస్టు 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ లోగా ప్రచారం ముమ్మరం చేశారు. అయితే కొరటాల ఇంటర్వ్యూలపై మహేష్ కాస్త గుర్రుగా ఉన్నాడని టాక్.
ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు కాదు, ఆ ఇంటర్వ్యూలలో కథంతా పూస గూచినట్టు చెప్పేస్తున్నాడని. ఊరి దత్తత నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ పాయింట్‌ని ట్రైలర్‌లోనే రివీల్ చేసేశారు. అయితే పదే పదే.. అదే పాయింట్‌ని, దాని వెనుక ఉన్న కథనీ... కొరటాల మీడియాకు లీక్ చేస్తున్నాడని, కథ తెలిసిపోతే సినిమా చూడ్డంలో ఇంట్రస్ట్ ఏముంటుందని మహేష్ కోప్పడుతున్నాడట. అసలు ట్రైలర్‌లోనే దత్తత అనే డైలాగులు వినిపించడమే మహేష్‌కి ఇష్టం లేదట. ఏదైతే యూనిక్ పాయింట్ అనుకొన్నామో, ఆ పాయింట్‌ని ముందే రివీల్ చేస్తే.. ఇక చూడ్డానికి ఏం మిగులుతుందని మహేష్ కొరటాలని క్వశ్చన్ చేస్తున్నాడట. అదీ పాయింటే కదా..??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
