మగధీర = బాహుబలి
on Apr 28, 2015
తెలుగు సినిమా సాంకేతికంగా ఎదిగింది అనడానికి మగధీర ఓ సాక్ష్యంగా నిలిచింది. అప్పటి వరకూ టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులనూ బ్రేక్ చేసి సంచలన విజయం సాధించిన చిత్రమిది. సరికొత్త ప్రయోగాలు చేయడానికి రాజమౌళికీ హోప్ అందించింది మగధీర. ఇప్పటి బాహుబలికి ఓ విధంగా స్ఫూర్తి మగధీర అనే చెప్పాలి. అందుకే మగధీర సెంటిమెంట్ బాహుబలికీ కొనసాగించాలని చూస్తున్నాడు రాజమౌళి. బాహుబలిని జూన్ 30న విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఆ రోజే ఎందుకంటే.. అది మగధీర విడుదలైన రోజు. టాలీవుడ్‌లో రికార్డుల పరంపరకు తెరతీసిన రోజు. అందుకే జూన్ 30న బాహుబలి విడుదల చేయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారట. కనీసం మే చివరి వారంలోకల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయితే, ప్రచారం కోసం ఓ నెల రోజుల వ్యవధి ఉంటుంది. అందుకోసం చిత్రబృందం రేయింబవళ్లూ కష్టపడుతోంది. మరి మగధీర డేట్ ని బాహుబలి పట్టుకొంటాడో లేదో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
