తెలుగు సినిమా సత్తా చూపించిన 'బాహుబలి'
on Jul 18, 2015
బాహుబలి రికార్డుల ఫర్వం కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా కొట్టేసింది. ఫుల్ రన్‌లో పీకే రికార్డుల్ని కొట్టే ఛాన్స్ ఉందా లేదా? అన్న విషయం పక్కనపెడితే .. ఈ సినిమా తొలివారం రికార్డుల్లో అద్భుతాలు ఆవిష్కరించింది. బాహుబలి రిలీజై సరిగ్గా ఈరోజుకి వారం పూర్తయ్యింది. రేపటి నుంచి రెండో వారంలో అడుగు పెడుతోంది.
ఇప్పటికి ఈ సినిమా భారతదేశంలో రిలీజైన అన్ని వెర్షన్లలో దాదాపు రూ.255కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పన్నుల బాదుడు మొత్తం సవరిస్తే రూ.185కోట్ల నెట్ వసూలు చేసింది. ఇంతవరకూ ఓ హిందీ సినిమా చేయలేని మ్యాజిక్ ఇది. ఓ ప్రాంతీయ సినిమా సాధించిన అసాధారణ విజయం ఇది. అంతేనా ఈ సినిమా ఇప్పటికే నైజాంలో అదిరిపోయే వసూళ్లు తెచ్చింది. ఏడు రోజుల్లో దాదాపు 21కోట్లు వసూలు చేసి దిల్‌రాజు పెట్టుబడుల్ని వెనక్కి తెచ్చేసింది. సోమవారంతో 22కోట్లు దాటుతుంది. అంటే ఇక నుంచి రాజుగారి కి అన్నీ లాభాలేనన్నమాట.
అలాగే అమెరికాలోనూ దాదాపు 6మిలియన్ డాలర్లు (60లక్షల డాలర్లు ) వసూలు చేసి ఇంతవరకూ అక్కడ ఉన్న తొలివారం రికార్డులన్నిటినీ కొట్టేసింది. అంతేనా అమెరికా బయ్యర్లకు దాదాపు పెట్టుబడికి రెట్టింపు లాభాల్ని అందించింది. ఏపీలో సోమవారం నాటికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. ఇక అక్కడినుంచి వచ్చేదంతా రాబడేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
