ENGLISH | TELUGU  

నవంబర్ లో ప్రభాస్ రెబెల్ ఆడియో రిలీజ్

on Jul 4, 2011

నవంబర్ లో ప్రభాస్ "రెబెల్" ఆడియో రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే బాలాజీ సినీ మీడియా పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అందాల యోగా టీచర్ అనుష్క, దీక్షా సేథ్ హీరోయిన్లుగా, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రెబెల్". ఈ ప్రభాస్ "రెబెల్" సినిమా స్క్రిప్ట్ చూసిన హీరో ప్రభాస్ తన అభిమానులు తననుంచి ఏం కోరుకుంటున్నారో గమనించి ఆ పద్ధతి ప్రకారం ఆ స్క్రిప్ట్ లో మార్పులనూ, చేర్పులనూ దర్శకుడు రాఘవ లారెన్స్ కు సూచించారట.

 

హీరో ప్రభాస్ చెప్పిన పద్ధతిలో స్క్రిప్ట్ తయారుచేసిన రాఘవ లారెన్స్ ఈ సినిమాని ప్రారంభించటం, హైదరాబాద్, వైజాగ్, బ్యాంకాక్ లలో ఈ సినిమా షూటింగ్ జరపటం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ "రెబెల్" సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతూంది.ఈ ప్రభాస్ "రెబెల్" సినిమాకి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూండగా, యస్ యస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తాండ్ .కె. వెంకటేష్ ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ "రెబెల్"సినిమాని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేస్తారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.