సమంత పెళ్లయిపోయిందా?
on Oct 27, 2014
తెలుగు ప్రేక్షకులకు, సమంత అభిమానులకూ ఇది షాకింగ్ న్యూసే. సమంత పెళ్లయిపోయిందట..! ఎవరితో అంటారా..?? ఇంకెవరు - సిద్దార్థ్‌తోనే. గత రెండేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకొంటా అని ఈమధ్యే సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే నిజానికి సమంత - సిద్దార్థ్‌లకు ఇది వరకే పెళ్లయిపోయిందని, ఇద్దరూ చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో కలసి ఉంటున్నారని చెన్నై మీడియా చెబుతోంది. యేడాది క్రితం స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకొన్న ఈ జంట.. ఆ తరవాత గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకొన్నారట. అయితే చట్టబద్ధంగా అందరికీ చెప్పుకోవడానికి కొన్ని అడ్డంకులున్నాయని అవి తొలగిపోయిన తరవాత... మీడియా ముందుకు జంటగా వస్తారని చెప్పుకొంటున్నారు. సమంత షూటింగుల నిమిత్తం హైదరాబాద్ వస్తే.. సిద్దార్థ్ కూడా వాలిపోతున్నాడట. ఇద్దరూ కలసి తరచూ ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తుంటారని, చెన్నైలో మాత్రం ఒకే చోట ఉంటున్నారని సమాచారమ్. ఈ వార్తలో నిజమెంతో చెన్నై మీడియాకూ, సమంత, సిద్దార్థ్ లకే తెలియాలి. నిజమైతే.. సమంత, సిద్దార్థ్‌లు ఎంత కాలం దాస్తారో చూడాలి.