ప్రియమైన రహస్యం!
on Apr 28, 2015
నా మనసుకేమయింది అని పాడుకుంటోందట రబ్బరు గాజుల పిల్ల ప్రియమణి. అందం, అభినయంతో టాలీవుడ్ లో పాపులర్ అయిన ప్రియ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టే. వచ్చీ రాగానే నేషనల్ అవార్డు అందుకున్నా....ఎంత తొందరగా ఫేమస్ అయిందో అంతే తొందరగా ఫేడవుట్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ట్రై చేసింది కానీ పెద్దగా సక్సెస్ అవలేకపోయింది. తెలుగు, తమిళంలో హవా తగ్గడంతో కన్నడ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇక్కడ ఆఫర్లు తగ్గడానికి కొందరు దర్శకులు, నిర్మాతలే అని చిర్రుబుర్రు లాడుతోంది. ఏదైతేనేం ఇక ఫేడవుట్ అయిపోవడం ఖాయం కాబట్టి ...పెళ్లి వైపు మససెళ్లిందట. ఈ మధ్య ఓ బిజినెస్ మెన్ తో యమా బిజీగా ఉందట. ఎవరమ్మా అతగాడెవరమ్మా అంటే మాత్రం ... స్నేహితుడా-రహస్య స్నేహితుడా అని మెలికలు తిరుగుతోందట. పైగా బయటకు మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటా అని స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో అమ్మడుకి పెళ్లి ఫిక్సైందా? లేదా? . ఇంతకీ అందాలభామ మనసు దోచిన గురుడెవరో మరి?