ఫ్యాన్స్ పై మండిపడుతున్న ప్రియమణి...!
on May 31, 2016
ఎంత సెలబ్రిటీలు అయినంత మాత్రాన, మా జీవితంలోకి వచ్చేసి మా నిర్ణయాలు కూడా మీరే తీసేసుకోవాలనుకుంటే ఎలా అంటూ ఫ్యాన్స్ పై నిప్పులు చెరుగుతోంది ప్రియమణి. విషయంలోకి వెళ్తే, తను ఇష్టపడ్డ ముస్తఫా అనే చెన్నై వ్యాపారవేత్తతో ప్రియమణి ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్ మెంట్ విశేషాన్ని చాలా ఆనందంగా తన ట్వీట్ చేసిన ప్రియమణికి ఊహించని పరిణామం ఎదురైంది.
వేరే మతస్థుడిని పెళ్లిచేసుకుందంటూ ఒకరు, లవ్ జీహాద్ కు ప్రియమణి పడిపోయిందంటూ మరొకరు..ఇలా ఆమె ఊహించని విధంగా సోషల్ మీడియాలో నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటికి ఆమె కూడా సరైన రెస్పాన్సే ఇచ్చింది. నా పెళ్లి నా ఇష్టం. మా ఇంట్లో వాళ్లకు నచ్చితే చాలు. మీ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దయచేసి వ్యక్తిగత విషయాల్లో వేళ్లు పెట్టకండి అంటూ రిటర్న్ ఝలక్ ఇచ్చింది. పాపం ఏదో పెళ్లి ఫిక్సయ్యింది కదా అని సంతోషంగా వార్తను షేర్ చేసుకుంటే, ఆ విధంగా ఆమె సంతోషాన్ని నీరు గార్చేశారు నెటిజన్లు. ఏదేమైనా, రోజురోజుకూ సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా తయారౌతుందనడంలో డౌట్ లేదు.