ఆ సినిమాలో ప్రియమణి వేశ్యట..
on Oct 6, 2016
మంచి అందం..ఆకట్టుకునే ఫిజిక్‌తో కొద్ది రోజుల పాటు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది మళయాళీ ముద్దుగమ్మ ప్రియమణి. ప్రస్తుతం కొత్తమ్మాయిలు దూసుకురావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికి అడపాదడపా ఏదో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న మనవూరి రామాయణంలో ప్రియమణి లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో మంచి హోమ్‌లో లుక్‌లో ప్రియ ఆకట్టుకుంటోంది. అదంతా పక్కనబెడితే ఇందులో ప్రియ క్యారెక్టర్ ఏలా ఉండబోతుందా అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ప్రియమణి వేశ్య పాత్రలో కనిపించనుందట..వేశ్య అయినా గానీ కథను మలుపుతిప్పేది ఆమెనట..రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మరిన్ని విషయాలు తెరపై చూడాల్సిందే..