ఆ క్యారెక్టర్స్ నాకు వద్దు... హీరోయిన్‌గానే నాకు ముద్దు
on Oct 16, 2019
కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రియ వంటి అతికొద్ది మంది హీరోయిన్లు మాత్రమే పదేళ్లుగా తమ అందచందాలను, ప్రేక్షకుల్లో అభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన ఛాన్సులు అందుకుంటున్నారు. అప్పట్లో నాగార్జున, రవితేజ, తరుణ్ తదితర హీరోల పక్కన నటించిన స్నేహ... అక్క, వదిన పాత్రలకు షిఫ్టయ్యారు. ‘తీన్‌మార్’లో పవన్‌కల్యాణ్ పక్కన ఫ్లాష్‌బ్యాక్‌లో హీరోయిన్‌గా నటించిన కృతీ కర్భందా ఇప్పటికీ హిందీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. కానీ, తెలుగులో రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’లో అక్కగా నటించారు. కాస్త క్రేజ్ తగ్గిన హీరోయిన్లు ఇతర పాత్రల కోసం చూస్తున్నారు. కానీ, ప్రియమణి మాత్రం హీరోయిన్‌గా చేస్తానని చెబుతున్నారు. తెలుగులో ఒకప్పుడు ప్రియమణి స్టార్ హీరోయిన్. బికినీలో హల్‌చల్ చేశారు. ఇప్పుడు మాత్రం స్టార్ కాదు. అలాగని, ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి తర్వాత నటించడమూ మానలేదు. కొంచెం ఒళ్లు చేసినా... ఫిట్‌నెస్, ఫిజిక్ మెంటైన్ చేస్తున్నారు. అయినా సరైన అవకాశాలు రావడం లేదు. వస్తే... యాక్టింగ్, గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. కానీ, ఇప్పుడు ప్రియమణికి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరోలు ఎవరున్నారు? ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పుడు ఆలోచించాల్సిందే.