ప్రియమణి మళ్ళీ మొదలెట్టింది!!
on Feb 20, 2019
ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న నటి ప్రియమణి. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ తర్వాత ఓ ఛానల్ లో ప్రసారమవుతోన డాన్స్ ద్వారా బుల్లితెరపై కనిపించింది. తాజాగా పెద్ద తెరపై మళ్ళీ కనువిందు చేయనుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే `సిరివెన్నెల` అనే టైటిల్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ప్రియమణి. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియమణి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. `ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తోన్న సినిమా ఇది. సిరివెన్నెల టైటిల్ ఎంత బావుంటుందో సినిమా అంత బావుంటుందంటూ చెప్పుకొస్తోంది ప్రియమణి`. సూపర్ నేచరల్ పవర్ నేపథ్యం లో సాగే థ్రిల్లర్ చిత్రమిది. గతంలో ప్రియమణి చారులత లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. `అంగుళీక` అనే ప్రారంభించింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. మరి ఈ సిరివెన్నెలతో తన సెకండ్ ఇన్నింగ్స్ సిరివెన్నెలలా ఉంటుందో సిమ్మసీకట్లు అవుతుంతో చూడాలి.