కీర్తి చేజారింది.. ప్రియమణి అందుకుంది!
on Jan 18, 2020
ఇది నిజంగా సెన్సేషనల్ న్యూస్! సంచల తార కీర్తి సురేశ్ స్థానంలో వెటరన్ హీరోయిన్ ప్రియమణి వచ్చింది!! అవును. అజయ్ దేవ్‌గణ్ హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్ ఫిల్మ్ 'మైదాన్'లో నాయికగా ఎంపికైన కీర్తి సురేశ్.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. నిజానికి ఆమె ఒక రోజు షూటింగ్‌లోనూ పాల్గొంది. స్క్రిప్ట్ ప్రకారం ఆమె అజయ్ భార్యగా, బిడ్డల తల్లిగా కనిపించాలి. కానీ ఆమె మరీ యంగ్‌గా కనిపిస్తోందని ఇటు ఆమె, అటు దర్శకుడు అమిత్ రవీందర్‌నాథ్ శర్మ కూడా భావించారు. ఫుట్‌బాల్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో సాధ్యమైనంతవరకు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా దర్శక నిర్మాతలు చూసుకుంటున్నారు. అందుకే పరస్పర అంగీకారంతోనే ఆ సినిమా నుంచి కీర్తి తప్పుకుంది.
ఇప్పుడు ఆమె స్థానంలోకి ప్రియమణి రావడం విశేషంగా చెప్పుకోవాలి. కీర్తి ఇమేజ్ ముందు ప్రియమణి ఇమేజ్ ఏమాత్రం సరితూగదు. సౌత్‌లో ఇవాళ కీర్తి సెన్సేషనల్ స్టార్ అయితే, ప్రియమణికి ఏమాత్రం డిమాండ్ లేదు. అయినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌లో హీరో మనోజ్ బాజ్‌పేయి భార్య పాత్రలో చక్కగా రాణించి, మంచి పేరు తెచ్చుకోవడం ఆమెకు ఈ అవకాశం లభించేలా చేసింది. ఇంకో విషయం ఏమంటే, కీర్తి తరహాలోనే ప్రియమణి కూడా జాతీయ ఉత్తమ నటి. ప్రస్తుతం ఆమె 'అసురన్' తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ జోడీగా, జయలలిత బయోపిక్ 'తలైవి'లో శశికళగా నటిస్తోంది.
జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరుణవ జాయ్ సేన్‌గుప్తా కలిసి నిర్మిస్తోన్న 'మైదాన్' మూవీ 2020 నవంబర్ 27న విడుదల కానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
